»   » ‘రేస్ 3’ మూవీని ప్లాప్ చేసే వరకు వదిలేట్టు లేరే... నెగెటివ్ కామెంట్స్!

‘రేస్ 3’ మూవీని ప్లాప్ చేసే వరకు వదిలేట్టు లేరే... నెగెటివ్ కామెంట్స్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Salman Gives A Strong Reply For Media

  సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'రేస్ 3'. ఈద్ సందర్భంగా జూన్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే 15న ట్రైలర్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈ సినిమాను ప్లాప్ చేసే వరకు వదలబోము అనే స్థాయిలో కొందరు విమర్శలతో ముంచెత్తారు. మరి ట్రైలర్ నచ్చలేదో? కేసుల ప్రభావం వల్ల సల్మాన్ భాయ్ మీద మొదలైన వ్యతిరేకతో తెలియదు కానీ... కొందరైతే బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

   పక్షులకు కూడా ఇండియాలో సేఫ్టీ లేదంటూ

  పక్షులకు కూడా ఇండియాలో సేఫ్టీ లేదంటూ

  ‘రేస్ 3' ట్రైలర్లో సల్మాన్ ఖాన్ ప్రత్యేకమైన సూట్ ధరించి గాల్లో ఎగురుతూ కనిపించారు. దీనిపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. జంతువులకు మాత్రమే కాదు... ఈ దేశంలో పక్షకులకు కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

   రేస్ 3 ట్రైలర్ చూసిన తర్వాత పరిస్థితి ఇదీ

  రేస్ 3 ట్రైలర్ చూసిన తర్వాత పరిస్థితి ఇదీ

  రేస్ 3 ట్రైలర్ చూసిన తర్వాత పరిస్థితి ఇలా తయారైంది అంటూ... కొందరు పైన కనిపిస్తున్న ఈ ఫన్నీ ఫోటోను పోస్టు చేశారు.

  అభిమానులను ఫూల్స్ చేస్తారా?

  అభిమానులను ఫూల్స్ చేస్తారా?

  అభిమానులను ఫూల్స్‌ను చేసేందుకే ఇలాంటి సినిమా చేశారు....అంటూ కొందరు ‘రేస్ 3' సినిమాను విమర్శించే ప్రయత్నం చేశారు.

  థమ్స్ అప్ యాడ్‌తో పోలుస్తూ...

  థమ్స్ అప్ యాడ్‌తో పోలుస్తూ...

  కొందరు ఈ సినిమాను థమ్స్ అప్ యాడ్‌తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. థమ్స్ అప్ యాడ్‌కు ఇది ఎక్సెండెట్ వెర్షన్‌లా ఉందని, ఇది బాలీవుడ్ గొప్ప సినిమా ఎప్పటికీ కాబోదంటూ అభిప్రాయ పడ్డారు.

  రేస్ సినిమా అంటే వారే... మీరు కాదు

  రేస్ సినిమా అంటే వారే... మీరు కాదు

  రేస్ ఫ్రాంచైజీ సినిమాలు అంటే బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్ స్టైల్, అబ్బాస్ మస్తానీ ట్విస్టులు గుర్తుకొస్తాయి. ఇలాంటి సినిమాలో ఎప్పటికీ సల్మాన్ ఖాన్, రెమో డిసౌజా మసాలాను ఊహించుకోలేం.... ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాదు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

  ప్లాప్ అని తేలిపోయిందంటూ...

  ప్లాప్ అని తేలిపోయిందంటూ...

  రేస్ 3 ట్రైలర్ చూడటంలోనే ఈ సినిమా పెద్ద ప్లాప్ అని తేలిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 100 కోట్లు కూడా వసూలు చేయడం కష్టమే. ‘102 నాటౌట్', ‘రాజి' లాంటి సినిమాలే ఇపుడు వర్కౌట్ అవుతాయి... ఇలాంటి రొటీన్ యాక్షన్ సినిమాలకు కాలం చెల్లింది అంటూ మరికొందరు విమర్శలకు దిగారు.

  కొన్ని పాజిటివ్ కామెంట్స్

  కొన్ని పాజిటివ్ కామెంట్స్

  ఇటు నెగెటివ్ కామెంట్లు ఏ స్థాయిలో వస్తున్నాయో.... కొందరి నుండి పాజిటివ్ కామెంట్స్ సైతం వస్తున్నాయి. సినిమా యాక్షన్ అద్భుతంగా ఉందని, హాలివుడ్ స్థాయిలో ఉందంటూ కొందరు పొగడ్తలతో ముంచెత్తారు.

  ట్రైలర్

  ఈద్(రంజాన్) సందర్భంగా జూన్ 15న విడుదల ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.

  English summary
  Yesterday (May 15, 2018), the trailer of Salman Khan starrer Race 3 hit the You Tube. While fans cheered for their 'Bhai' as he was seen packing punches, the 'non-bhai' fans had a field day on Twitter and they ended up trolling Salman Khan & Race 3 back and forth! Some of them called it the 'extended version of Thums Up ad', while some said Salman Khan has become so 'mean' that he's only making movies for his die-hard fans.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more