ఫస్ట్ పిక్: తండ్రితో కలిసి నటించిన మెగాస్టార్ బిగ్ బి కూతురు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అందరూ నటులే. అయితే ఆయన కూతురు శ్వేతా బచ్చన్ మాత్రం ముందు నుండి వెండి తెరకు దూరంగానే ఉంటున్నారు. సినిమా కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా కనిపించరు.
2010లో తొలిసారిగా శ్వేతా బచ్చన్ తన తండ్రితో కలిసి కరణ్ జోహార్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' ద్వారా బుల్లితెరపై కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఆమె ఎప్పుడూ స్మాట్ లైట్లోకి రాలేదు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ఫేమస్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి ఆమె డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ వచ్చారు.

దాదాపు మళ్లీ 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత శ్వేతా బచ్చన్ మరోసారి స్మాల్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అది కూడా తండ్రితో కలిసే! తండ్రి కూతుళ్లు ఇద్దరూ కలిసి తాజాగా ఓ టీవీ కమర్షియల్ యాడ్లో నటించారు.

ఈ యాడ్ ఫిల్మ్‌కు జిబి విజయ్ దర్శకత్వం వహించారు. కల్యాణ్ జ్యువెల్లర్స్ అనే సంస్థ కోసం ఈ యాడ్ ఫిల్మ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా శ్వేతా త్వరలో తను రాసిన 'ప్యారడైజ టవర్స్' అనే పుస్తకాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











