సుహానాపై రూమర్లకు చెక్ పెట్టిన షారుక్ సతీమణి
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినీ రంగ ప్రవేశంపై కొద్దికాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటి ఊహాగానాలకు, రూమర్లకు తెరదించుతూ షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల 'హలో... హాల్ ఆఫ్ ఫేమ్' అవార్డుల కార్యక్రమానికి హాజరైన గౌరీఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సుహానా ఓ మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం షూటింగులో పాల్గొన్నది అని వెల్లడించింది.

2018 సంవత్సరం సుహానా జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నది. అలాంటి అత్యుత్తమ క్షణాల కోసం నేను ఎదురుచూస్తున్నాను అని గౌరీ ఖాన్ అన్నారు. షారుక్ మాటలను బట్టి చూస్తే సుహానా వెండితెరపై కనిపించేందుకు ఇంకెంతో టైం పట్టదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలు నాటకాల్లో నటించడం ద్వారా అభిమానుల మనసులను దోచుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











