»   » అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ట్రైలర్: దేశ భక్తి రగిలించే రియల్ స్టోరీ

అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ట్రైలర్: దేశ భక్తి రగిలించే రియల్ స్టోరీ

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గోల్డ్'. 1936 నుంచి 1948 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రీమా కగ్టి దర్శకత్వం వహించారు. మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ కుమార్ ‌సింగ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.

  భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం 1948లొ లండన్లో జరిగిన ఒలంపిక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. 200 సంవత్సరాలు మనల్ని పాలించిన బ్రిటిష్ వారు మన జెండాకు సెల్యూట్‌ చేయాల్సిన పరిస్థితులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన కోచ్ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించారు.

  'ఓ కల నిజం కావడానికి 12 సంవత్సరాలు పట్టింది' అంటూ విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడిలో దేశభక్తి రగిలించేలా ఉంది. ట్రైలరే ఈ స్థాయిలో ఉందంటే థియేటర్లో సినిమా చూస్తే రొమాలు నిక్కబొడిచి పులకించి పోవడం ఖాయం.

  Gold Theatrical Trailer

  రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్ నిర్మించిన ఈ చిత్రానికి సచిన్‌-జిగర్‌ అందించారు. ఈ ట్రైలర్‌ను అక్షయ్‌ ట్విటర్లో షేర్ చేస్తూ... 'బ్రిటిషు ఇండియాలో విజేతలు.. స్వాతంత్ర్య భారత దేశంలో లెజెండ్స్‌' అని ట్వీట్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భంగా‌ ఆగ‌స్ట్ 15న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.

  English summary
  Gold Theatrical Trailer Released. A historical sports drama inspired by India’s first Olympic gold medal. The film traces the “golden era” of Indian hockey through the journey of Tapan Das, a young assistant manager in 1936, who dreams of playing for an independent nation. Starring: Akshay Kumar, Mouni Roy, Kunal Kapoor, Amit Sadh, Vineet Singh, Sunny Kaushal & Nikita Dutta. GOLD releases in theatres on 15th August, 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more