Goodbye యాక్టర్ ఇకలేరు.. రిలీజ్ రోజునే సీనియర్ నటుడు కన్నుమూత!

హిందీ సినీ, టెలివిజన్ రంగాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ఆకట్టుకొన్న అరుణ్ బాలీ ఇకలేరు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నటించిన గుడ్‌బై చిత్రం శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో నీనా గుప్తా పాత్రకు తండ్రిగా ఎమోషనల్ పాత్రలో కనిపించారు. అయితే అరుణ్ బాలీ మరణవార్తను సహచర నటి నీలూ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. అరుణ్ బాలీ మృతితో విషాదంలో మునిగిపోయిన సినీ తారలు సంతాపం తెలియజేస్తూ.. శ్రద్దాంజలి ఘటించారు.

అరుణ్ బాలీ 1942లో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. 1989లో షారుఖ్ ఖాన్ నటించిన దూస్రా కేవల్ అనే టీవీ సీరియల్ ద్వారా అరుణ్ బాలీ నటనా రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1191లో సౌగంధ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత యల్‌గార్, రాజు బన్ గయా జెంటిల్మన్, హీర్ రాంజా, ఖల్ నాయక్, రామ్ జానే, సత్య, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియెట్స్, రెడీ, బర్ఫీ, పీకే, పానిపట్, లాస్ సింగ్ చద్దా, గుడ్ బై చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో 50కిపైగా చిత్రాల్లో నటించారు. అలాగే డజనుకుపైగా సీరియల్స్‌లో ప్రభావవంతమైన పాత్రలు పోషించారు. గుడ్ బై చిత్రంలో పేషెంట్‌గా ఎమోషనల్ పాత్రలో కనిపించారు.

Goodbye actor Arun Bali passed away at the age of 79

బాలీవుడ్ నటి నీలూ కోహ్లీ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ.. బాలీ సాబ్ మీరు ఇలాంటి తీవ్రమైన నిర్ణయం ఎలా తీసుకొన్నారు. మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకొనే వాళ్లం. ఈ రోజు మీరు నటించిన గుడ్‌బై చిత్రం రిలీజైంది. ఈ రోజు మనందరం కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సంతోషంగా ఉండాలని అనుకొన్నాం. కానీ ఇలా మనందరి ఫోటోను షేర్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. గుడ్‌బై అరుణ్ బాలీ.. జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X