దేవుడు దిగొచ్చినా నా భర్తతో విడదీయలేడు.. విడాకులపై హీరో భార్య క్లారిటీ

బాలీవుడ్ సూపర్‌‌స్టార్ గోవిందా, అతని భార్య సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తుండటంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. విడాకుల కోసం సునీత కోర్టులో పిటిషన్ వేశారని.. ప్రస్తుతం వీరిద్దరూ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నట్లుగా కథనాలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరిగా వెలుగొందిన ఈ జంట తమ 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ జంట ఫుల్‌స్టాప్ పెట్టబోతోందని వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై గోవింద తొలిసారిగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

హీరోయిన్లతో గోవిందకు ఎఫైర్లు
గోవింద- సునీతల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, ఇద్దరూ సఖ్యతగా లేరని వార్తలు వచ్చాయి. అయితే ప్రతీసారి ఈ జంట ఈ పుకార్లకు చెక్ పెడుతూనే ఉంది. గతంలో స్టార్ హీరోయిన్లు నీలం, రవీనా టాండన్‌‌ సహా పలువురు హీరోయిన్లతో గోవిందకు ఎఫైర్లు ఉన్నాయని.. ఇవి సునీత దాకా వెళ్లడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిని సునీత ఖండించారు. అయితే ఈసారి మాత్రం విడాకులు ఖాయమనే రేంజ్‌లో కథనాలు హల్ చల్ చేశాయి.

Govinda Sunita Ahuja Divorce Hero Wife Shuts Down Divorce Rumours After She Celebrating Ganesh Chaturthi

విడాకుల కోసం కోర్టుకెక్కిన సునీత
మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్‌తో గోవిందకు ఎఫైర్ నడుస్తోందని, అందుకే ఈసారి మాత్రం గోవిందను క్షమించే ప్రసక్తే లేదని ఊహాగానాలు వినిపించాయి. ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. వేధింపులు, వ్యభిచారం, విడిచిపెట్టడం వంటి అభియోగాలను భర్తపై మోపినట్లుగా కథనాలు వైరల్ అయ్యాయి. తమ వైవాహిక జీవితం గురించి సునీత మాట్లాడిన కొద్దిరోజులకే ఈ నిర్ణయం రావడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. అంతేకాదు.. దాదాపు 12 ఏళ్లుగా తన పుట్టినరోజును తాను ఒంటరిగా జరుపుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేయడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది.

విడాకులపై స్పందించిన గోవింద లాయర్
అయితే గోవింద - సునీత మధ్య విడాకుల వార్తలపై గోవింద న్యాయవాది లలిత్ బింద్రా స్పందించారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, అన్ని సమస్యలు పరిష్కరించుకున్నారని కామెంట్ పెట్టారు. మీడియా పాత విషయాలను అనవసరంగా బయటకు తీస్తోందని, వినాయక చవితి రోజున మీరే వారిని జంటగా చూస్తారని లలిత్ తేల్చిచెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ముంబైలోని తన నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో గోవింద, సునీత హాజరయ్యారు. ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి ప్రజలకు అభివాదం చేస్తూ, నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

దేవుడు దిగొచ్చినా విడదీయలేడు
అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ.. విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టారు. మీరంతా అనుకున్నట్లుగా ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము ఇలా దగ్గరగా ఉండేవాళ్లం కాదని, ఆ దేవుడే దిగొచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరని సునీత తేల్చిచెప్పారు. తన మనసులో గోవిందకు తప్పించి మరెవరికి స్థానం లేదు, స్వయంగా మేము చెప్పేవరకు మా కుటుంబం గురించి వచ్చే వార్తలను నమ్మొద్దని సునీత పేర్కొన్నారు. సునీత క్లారిటీ ఇవ్వడంతో గోవింద అభిమానులు, బాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

More from Filmibeat

Read more about: govinda sunita ahuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X