twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్ ఫ్లిక్స్ దండయాత్ర... అందరి దృష్టీ అతిలోక సుందరి కూతురిపైనే...

    |

    కరోనా విజృంభణ సద్దుమణగడంలేదు, ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే వీలు లేదు, సినీ జనాలకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లే పెద్ద దిక్కుగా మారాయి. దీంతో ఓటీటీల్లో డైరెక్ట్ రిలీజ్ లు ఊపందుకున్నాయి. ఇటీవలే గులాబో సితాబో, శకుంతలా దేవి వంటి భారీ చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ అయ్యి మంచి స్పందనను రాబట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఇతర సినిమాలు కూడా అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మంచి తరుణం మించిన రాదు అన్న సామతెను నూటికి నూరు శాతం వాడేసుకుంటోన్న నెట్ ఫ్లిక్స్, ఈ లాక్ డౌన్ కాలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటోంది.

    పెరిగిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని, ఒకేసారి 17 సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో పలు బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా ఉండటం విశేషం. లూడో, తోర్ బాజ్, రాత్ అకేలీ హై, డాలీ కిట్టీ ఔర్ వో చమక్ తే సితారే, గుంజన్ సక్సేనా వంటి సినిమాలు త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

    Gunjan Saxena Grabs attention amidst 17 releases

    అయితే, ఈ రిలీజ్ ల దండయాత్ర నడుమ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. కార్గిల్ గర్ల్ గా పేరుగాంచిన గుంజన్ సక్సేనా జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ టైటిల్ రోల్ పోషిస్తోంది.
    శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గుంజన్ సక్సేనా ఆగస్ట్ 12న విడుదలవ్వబోతోంది. భారత తొలి మహిళా నౌకాదళ అధికారి హోదాలో యుద్ధభూమిలో అడుగుపెట్టిన వీర వనిత గుంజన్ సక్సేనా పేరుగడించారు.

    జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, అంగద్ బేడీ, పంకజ్ త్రిపాఠీ ఇతర ప్రాధాన్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి జనాల్లో నెలకొన్న భారీ అంచనాలను జాన్వీ ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Popular OTT platform Netflix grabs headlines for releasing 17 feature films and webseries back to back. Including Multi starrer Ludo and Gunjan saxena.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X