మత్తుమందిచ్చి అత్యాచారం.. స్టార్ యాక్టర్ పై యువతి పిర్యాదు, కడుపు కూడా తీయించేశాడు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. అతనిపై ముంబైలో కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఒక యువతి అతనిపై లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మహాక్షయ్ తల్లిపై కూడా ఆ యువతి పలు రకాల ఆరోపణలు చేస్తూ.. వాళ్ళ నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆరోపించారు.

నమ్మించి మోసం చేశాడు అంటూ..
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ ఫ్యామిలీపై ఒక యువతి చేసిన ఆరోపణలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. మిథున్ చక్రవర్తి తనయుడుమహాక్షయ్‌తో తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ముంబైకి చెందిన యువతి కోర్టుకు వెళ్లడంతో అక్టోబరు 15న ఓషివారా పోలీసులు ఆయనపై అత్యాచారం కేసును నమోదు చేశారు.

అత్యాచార ఆరోపణలు రావడంతో..
2015 నుంచి మహాక్షయ్‌తో లవ్ లో ఉన్నట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. హాంటెడ్ 3D, రాకి వంటి సినిమాలతో అటు బాలీవుడ్ లోనే కాకుండా బెంగాలీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహాక్షయ్ సడన్ గా అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఇతర కాంట్రవర్సీ గోడవలతో వార్తల్లోకి ఎక్కింది మహాక్షయ్ ఈ సారి రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో కొందరు నమ్మలేకపొతున్నారు.

తాగే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి..
మహాక్షయ్ తనను నమ్మించి ఒక రోజు తాగే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపాడని, ఆ తరువాత తనపై అత్యాచారం చేశాడని యువతి పిర్యాదులో పేర్కొంది. నాలుగేళ్ల వరకు ప్రేమలో ఉన్న ఆ నటుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మొహం చాటేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా వదిలేశాడని బలవంతంగా గర్భస్రావం కూడా చేయించాడని తెలిపింది.

హీరో తల్లి కూడా బెదిరించింది
ఇక 2018లో మహాక్షయ్, మదాలస శర్మను వివాహం చేసుకున్న అనంతరం ముంబయిలో కేసు పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టించుకోలేదని అందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక ఫైనల్ గా ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం వెంటనే అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని చెప్పగా ఓషివారాలో కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఇక కేసు నమోదైన అనంతరం కేసు విత్ డ్రా చేసుకోవాలని మహాక్షయ్ తల్లి యోగితా బాలీ బెదిరించారని కూడా ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











