సెన్సేషనల్ హీరోతో బ్రేకప్.. బాధని భరించలేక నటి ఎమోషనల్!

యంగ్ హీరో విక్కీ కౌశల్ యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దేశం మొత్తం ఫేమస్ అయిపోయాడు. యురి చిత్రంలో విక్కీ కౌశల్ నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఆర్మీ అధికారి పాత్రలో విక్కీ ఒదిగిపోయి నటించాడు. విక్కీ కౌశల్ తన ప్రేమ వ్యవహారంతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. విక్కీ కౌశల్, హర్లీన్ శేతి కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. కానీ మార్చిలో వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. హర్లీన్ సోషల్ మీడియాలో విక్కీని అన్ ఫాలో చేయడంతో అంతా ఓ నిర్ధారణకు వచ్చారు. తాజాగా హార్లిన్ తన ఇంస్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సింగిల్‌గానే ఉన్నా

సింగిల్‌గానే ఉన్నా

విక్కీ కౌశల్ కూడా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తాను సింగిల్ గానే ఉన్నానని ప్రకటించాడు. దీనితో విక్కీ, హర్లీన్ విడిపోయినట్లు మరోమారు తేలింది. గత ఏడాది విక్కీ కౌశల్ పలు ఇంటర్వ్యూలలో హర్లీన్ శేతి గురించి ప్రస్తావించాడు. యురి చిత్రం తర్వాత విక్కీ కౌశల్ కు లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. హర్లీన్ ని చూసి చాలా మంది అమ్మాయిలు జలసీ ఫీల్ అవుతున్నారంటూ కూడా విక్కీ కౌశల్ పై బాలీవుడ్ లో కామెంట్స్ వినిపించాయి.

 డిప్రెషన్‌లోకి

డిప్రెషన్‌లోకి

విక్కీ కౌశల్ తో విడిపోయిన తర్వాత హర్లీన్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆమె మానసిక సమస్యలతో భాదపడుతున్నట్లు కూడా తెలిసింది. ప్రేమలో విహరిస్తున్న వీరిద్దరూ అనుకోని విధంగా ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా హర్లీన్ శేతి విక్కీ కౌశల్ తో తన ప్రేమ బ్రేకప్ కావడం గురించి పరోక్షంగా ప్రస్తావించింది. ఎమోషనల్ గా ఫీల్ అవుతూ పెద్ద కవితని పోస్ట్ చేసింది. దీనితో హర్లీన్ ఇప్పటికి విక్కీ కౌశల్ జ్ఞాపకాల నుంచి బయట పడలేకపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 స్నేహితుల ద్వారా

స్నేహితుల ద్వారా

విక్కీ కౌశల్ ఓ ఇంటర్వ్యూలో హర్లీన్ గురించి ప్రస్తావించాడు. తామిద్దరం ఉమ్మడి స్నేహితుల ద్వారా కలుసుకున్నామని తెలిపాడు. మా ఇద్దరి తొలి పరిచయం నుంచే ఒకరిపై ఒకరికి అభిమానం ఏర్పడింది. మేమిద్దరం ఏ సందర్భంలోను ఒకరిని ఒకరం ప్రశ్నించుకోలేదు. అంతలా మా అభిప్రాయాలు కలిసాయి అని విక్కీ కౌశల్ తెలిపాడు. మా కలయిక చాలా సహజంగా జరిగింది. వృత్తి పరంగా మాత్రం ఒకరి లోపాలని ఒకరం సరిచేసుకుంటుంటాం అని విక్కీ తెలిపాడు.

ఒంటరినైపోయా

విక్కీ కౌశల్ తో బ్రేకప్ కాగానే హర్లీన్ శేతి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నేనిప్పుడు ఒంటరినైపోయా. విశ్వం మధ్యలో నేనొక్కదాన్నే ఉన్నట్లు అనిపిస్తోంది. నా ప్రేమ విఫల గాధగా మిగిలిపోయిందని హర్లీన్ శేతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోమారు విక్కీ కౌశల్ ప్రేమని గుర్తు తెచ్చుకుని హర్లీన్ ఎమోషనల్ అవుతోంది. విక్కీ కౌశల్ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X