»   » #మీటూ ఎఫెక్ట్: తెలుగు స్టార్ రానా దగ్గుబాటికి అవకాశం?

#మీటూ ఎఫెక్ట్: తెలుగు స్టార్ రానా దగ్గుబాటికి అవకాశం?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  #మీటూ ఉద్యమం కారణంగా బాలీవుడ్ చిత్ర సీమలో ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపుల అంశాలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు కూడా లభించడంతో మూమెంట్ మరింత బలపడింది.

  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉండటంతో పలువురు అగ్ర దర్శకులు, అగ్ర నటులు భారీ ప్రాజెక్టు సినిమాల నుంచి తప్పకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 'హౌస్ ఫుల్ 4' దర్శకుడు సాజిద్ ఖాన్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతడిని తప్పించారు. ఆయన స్థానంలో పర్హాద్ సంజీ డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించారు.

  నానా పాటేకర్ ఔట్

  నానా పాటేకర్ ఔట్

  హౌస్‌‌ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు నానా పాటేకర్ కూడా తప్పుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నానా పాటేకర్ తన పట్ల పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగులో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

  రానా దగ్గుబాటికి అవకాశం

  రానా దగ్గుబాటికి అవకాశం

  నానా పాటేకర్ తప్పకుంటే ఆ అవకాశం తెలుగు స్టార్ రానా దగ్గుబాటికి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు. త్వరలోనే ఈ విషయం ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  #Metoo : Divya Khosla Responds On Her Husband
  రియాల్టీ షో నుంచి తప్పుకున్న అను మాలిక్

  రియాల్టీ షో నుంచి తప్పుకున్న అను మాలిక్

  #మీటూ ఉద్యమం బాలీవుడ్లో ప్రకంపణలు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్ మీద నలుగురు సింగర్స్ అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు చేయడంతో ఇండియన్ ఐడల్ 10 సింగింగ్ రియాల్టీ షో నుంచి జడ్జిగా తప్పుకోవాల్సి వచ్చింది.

  ప్రముఖుల మీద ఆరోపణలు

  ప్రముఖుల మీద ఆరోపణలు

  #మీటూ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులైన నానా పాటేకర్, దర్శకుడు సుభాష్ ఘాయ్, వికాస్ బహల్, సాజిద్ ఖాన్, అను మాలిక్ మీద ఆరోపణలు వచ్చాయి. మరో దర్శకుడు సుభాష్ కపూర్ మీద ఆరోపణలు రావడంతో అతడితో సినిమా చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అమీర్ ఖాన్.

  English summary
  Rana Daggubati is a well-known actor in the South and he became a household name in the country after he portrayed the role of Bhallaldeva in the Baahubali series. His performance was one of the best and he received applause from people not only from India, but all across the world as well. It looks like Bollywood is calling him once again after his portrayal in The Ghazi Attack in 2017 and he might replace Nana Patekar in Housefull 4, after he was kicked out of the Akshay Kumar starrer due to sexual harassment allegations pinned up against him by Tanushree Dutta.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more