హృతిక్ రోషన్ బర్త్ డే.. అదిరిపోయే అప్డేట్‌తో రచ్చ

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే నేడు (జనవరి 10). ఈ క్రమంలో ఫ్యాన్స్, సెలెబ్రిటీలు హృతిక్ రోషన్‌కు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. అయితే హృతిక్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాదికిపైనే అవుతోంది. చివరగా టైగర్ ష్రాఫ్ హృతిక్ కలిసి వార్ సినిమాలో నటించారు. సైరాకు పోటిగా వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది. చాలా రోజులు తరువాత హృతిక్‌కు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం లభించింది.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ చేసే సినిమాలు దాదాపు బాక్సాఫీస్ హిట్లే. ఇప్పటి వరకు బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ కూడా సూపర్ హిట్లయ్యాయి. తాజాగా ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. హ్యాట్రిక్ కొట్టే దిశగా సిద్దార్థ్ ఆనంద్ హ‌ృతిక్ రోషన్ రెడీ అయ్యారు. అంతే కాకుండా ఈ మూవీ విడుదల తేదీ, హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారన్న విషయాలను కూడా ప్రకటించేశారు.

Hrithik Roshan And Deepika padukone Fighter Project Update

మామూలుగానే ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమాలు అక్టోబర్ 2న వస్తుంటాయి. గాంధీ జయంతి అంటూ హాలీడేను చూసుకుని వస్తుంటారు. అందులో భాగంగా బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాన్ని 2014 అక్టోబర్ 2న, వార్ సినిమాను అక్టోబర్ 2, 2019న రిలీజ్ చేశారు. ఇక ఈ మూడో సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హీరోయిన్‌గా దీపిక పదుకొణెను ఎంచుకున్నారు. 2022లో సెప్టెంబర్ 30న ఈ మూవీ విడుదల కాబోతోందని ప్రకటించేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X