లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హృతిక్.. మీడియా కంటికి చిక్కకుండా ముఖాన్ని అలా దాచేస్తూ.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ మరోసారి తన గర్ల్‌ఫ్రెండ్‌తో మీడియా ముందు బుక్కయ్యాడు. ముంబైలోని జుహు ప్రాంతంలో తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వచ్చిన హృతిక్ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. హృతిక్ రాకను పసిగట్టిన మీడియా ఫోటోగ్రాఫర్లు వారిని వెంటాడి కెమెరాలో బంధించారు. ఈ తాజా ఫోటోలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హృతిక్ డేటింగ్ వ్యవహారం

హృతిక్ డేటింగ్ వ్యవహారం

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కుమారుడు ఇమాద్ షా నిర్వహించే మ్యూజిక్ బ్యాండ్‌లో కీలక సభ్యురాలైన సబా కరీం ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో డేటింగ్ చేస్తున్నారు. గత వారంలో రెండు, మూడు సార్లు ఏకంగా సమయాన్ని గడుపుతూ మీడియాకు కంటపడ్డారు. అయితే వారు తమ రిలేషన్‌షిప్ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మీడియాకు మరింత ఆసక్తిని పెంచింది. భార్యకు విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటూ వస్తున్న హృతిక్ తాజాగా సబాతో కంటపడటం చర్చనీయాంశమైంది.

 ప్రియురాలి చేతిలో చేయివేసి హృతిక్

ప్రియురాలి చేతిలో చేయివేసి హృతిక్

ఇక ముంబైలో కోవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్న సమయంలో హృతిక్, సబా ఆజాద్ బహిరంగ ప్రదేశాల్లో రొమాంటిక్ కనిపిస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే ప్రియురాలితో డేటింగ్ చేస్తూ హృతిక్ ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కారులో నుంచి దిగుతూ ప్రియురాలి చేతిని పట్టుకొని హృతిక్ నడుచుకొంటూ వెళ్లారు. ముఖానికి తెల్లటి మాస్క్ ధరించిన హృతిక్ కనిపించారు.

 జుట్టుతో ముఖాన్ని కప్పేసుకొన్న సబా ఆజాద్

జుట్టుతో ముఖాన్ని కప్పేసుకొన్న సబా ఆజాద్

హృతిక్, సబా ఆజాద్ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని నడుస్తూ వెళ్తూంటే మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ క్షణాలను కెమెరాలో బంధించారు. అయితే మీడియా ఫోటోగ్రాఫర్లు వెంటపడటంతో సబా ఆజాద్ తన జుట్టును కప్పేసుకొని ముఖాన్ని దాచిపెట్టారు. కెమెరాలకు తన ముఖం కనిపించకుండా జాగ్రత్తగా, చాకచక్యంగా రెస్టారెంట్‌లోకి వడివడిగా నడుచుకొంటూ వెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్లు ఎంత ప్రయత్నించిన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నది.

 కొద్ది నెలలుగా చాటుమాటు వ్యవహారం

కొద్ది నెలలుగా చాటుమాటు వ్యవహారం

హృతిక్, సబా ఆజాద్ ఇద్దరి రొమాన్స్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారం రోజుల్లో హృతిక్, సబా ప్రేమపక్షుల్లా కనిపించడం ఇది రెండోసారి. దీంతో వీరి వ్యవహారం గురించి సినీ వర్గాల్లోనే కాకుండా ముంబై మీడియాలో వేడి వేడి చర్చ జరుగుతున్నది. అయితే వీరిద్దరి రొమాన్స్, డేటింగ్ గత కొద్ది నెలల క్రితమే మొదలైందని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ హృతిక్ తమ రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పెదవి విప్పకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 సబా ఆజాద్ సినీ కెరీర్ ఇలా..

సబా ఆజాద్ సినీ కెరీర్ ఇలా..

సబా ఆజాద్ విషయానికి వస్తే.. దిల్ కబాడ్డీ అనే సినిమాతో 2008లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగి చిత్రంల నటించారు. ఇటీవల నెటిఫ్లిక్స్ ఒరిజినల్ ఫీల్స్ లైక్ ఇష్క్ అనే సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పలు ప్రాజెక్టులు చర్చల దశలో పెట్టి.. ప్రస్తుతం హృతిక్‌తో డేటింగ్ విషయం ద్వారా మరింత పాపులారిటి సంపాదించుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X