twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబంలో విషాదం!

    |

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, హృతిక్ రోషన్ తాతయ్య జె ఓం ప్రకాష్ ఇక లేరు. వయసు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న 93 ఏళ్ల ఈ దర్శక నిర్మాత బుధవారం కన్నుమూశారు. తన అంకుల్ మరణాన్ని ధృవీకరిస్తూ బాలీవుడ్ నటుడు దీపిక్ పరాశర్ ట్విట్ చేశారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని పవన్ హన్స్ విల్లే పార్లేలో నిర్వహించారు.

    బుధవారం(ఆగస్టు 7) ఉదయం 8 గంటలకు ముంబైలోని తన నివాసంలో జె ఓం ప్రకాష్ తుది శ్వాస విడిచారు. రాజేష్ ఖన్నాతో ఆప్ కి కసమ్, జితేంద్రతో అప్నా, ఆద్మీ ఖిలోనా హై లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆస్ కా పంచి, ఆయే దిన్ బాహర్ కే లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

    రాజేష్ ఖన్నా మూవీతో కెరీర్ ప్రారంభం

    రాజేష్ ఖన్నా మూవీతో కెరీర్ ప్రారంభం

    1974లో వచ్చిన రాజేష్ ఖన్నా చిత్రం ‘ఆప్ కి కసమ్' మూవీతో జె ఓం ప్రకాష్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. మ్యూజికల్‌గా కూడా ఇది విజయం సాధించింది.

    జితేంద్రతో హిట్ చిత్రాలు చేసిన ఓం ప్రకాష్

    జితేంద్రతో హిట్ చిత్రాలు చేసిన ఓం ప్రకాష్

    జితేంద్రతో ఆప్నా బనా లో(1982), అప్నాపన్(1977), ఆశా(1980), అర్పన్ (1983), ఆత్మీ ఖిలోనా హై (1993) లాంటి చిత్రాలు చేశారు. ఓం ప్రకాష్ నిర్మాణంలో వచ్చిన ఆయీ మిలన్ కి బేలా(1964), ఆస్ కా పంచి(1961), ఆయే దిన్ బాహక్ కె (1966), ఆంఖో ఆంఖో మే(1972), ఆయే సావన్ ఝూం కె(1969) మంచి విజయం అందుకున్నాయి.

    తాతయ్య గురించి హృతిక్

    తాతయ్య గురించి హృతిక్

    ఓం ప్రకాష్ కూతురు పింకీ వివాహం బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్‌తో జరిగింది. వీరి సంతానమే హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ తన ట్విట్టర్లో తాతయ్య ఫోటోలు షేర్ చేస్తూ...‘మై సూపర్ టీచర్' అంటూ పేర్కొన్నారు. ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన చెప్పిన విషయాలు నాలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచాయని తెలిపారు.

    కారు బహుమతిగా..

    కారు బహుమతిగా..

    తాతయ్యకు హృతిక్ రోషన్ చాలా క్లోజ్. 2016లో తాత కోసం లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయన వద్దే పెరగడంతో తాతకు ఏ కారు ఇష్టమో బాగా తెలుసు. ఆయన ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న(మెర్సిడెజ్ బెంజ్) కారును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

    English summary
    Hrithik Roshan’s grandfather J Om Prakash dies in Mumbai. Jay Om Prakash was an Indian film producer and director born in Sialkot, Punjab, British India. He directed successful films like Aap Ki Kasam (1974), Aakhir Kyon? (1985) both with Rajesh Khanna as the lead hero and his other successful directorial ventures include Apnapan (1977), Aasha (1980), Apna Bana Lo (1982), Arpan (1983), Aadmi Khilona Hai (1993) with Jeetendra as the lead hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X