సూపర్ 30: టీచర్స్ డే స్పెషల్‌గా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన హృతిక్

By Bojja Kumar

టీచర్స్ డే(సెప్టెంబర్ 5) సందర్భంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. తను నటిస్తున్న తాజా మూవీ 'సూపర్ 30' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడదుల చేశారు. ఈ చిత్రంలో ఆయన టీచర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాథమేటీషియన్ ఆనందర్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హృతిక్ విడుదల చేసిన మూడు ఫోటోస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టీవీ సోప్ 'కుంకుమ్ భాగ్య' ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇందులో హృతిక్ లవ్ ఇంట్రెస్టుగా కనిపించనుంది.

 Hrithik Roshans Super 30 First Look Posters

పట్నాకు చెందిన మ్యాథమెటీషియన్‌ ఆనంద్‌ కుమార్‌ ఏటా ఆర్థికంగా వెనుకబడిన 30 మంది విద్యార్థులకు ఐఐటీ పరీక్ష రాయడానికి శిక్షణ ఇస్తుంటారు. దీని వల్ల పేదరికంలో ఉన్న ప్రతిభగల విద్యార్థుల జీవితాలు ఎలా మారిపోయాయి అనే పాయింటును ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది.

 Hrithik Roshans Super 30 First Look Posters

హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో ఆయన పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించబోతున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అవ్వగా... అందులో హృతిక్ సైకిల్ మీద తిరుగుతూ అప్పడాలు అమ్ముతూ కనిపించారు.

ఇప్పటికే 'కాబిల్' చిత్రంలో అంధుడిగా నటించిన హృతిక్ ఇపుడు సూపర్ 30లో ఎలాంటి గ్లామర్ లేకుండా కనిపిస్తూ ప్రయోగానికి సిద్ధం కావడం సాహసమే. 'సూపర్ 30' మూవీని 2019 జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X