Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
‘అవతార్’ టైటిల్ నేనే ఇచ్చానన్న బాలీవుడ్ హీరో... ఓ ఆటాడుకున్న నెటిజన్స్!
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన 'అవతార్' ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గత పదేళ్లుగా కలెక్షన్ల పరంగా దాన్ని కొట్టే సినిమా రాలేదు. ఇటీవల విడుదలైన 'అవెంజర్స్: ది ఎండ్ గేమ్' అతి కష్టం మీద 'అవతార్' రికార్డును బద్దలు కొట్టింది.
తాజాగా 'అవతార్' గురించి బాలీవుడ్ నటుడు గోవిందా ఆస్తికర వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కామెరూన్‌కు 'అవతార్' టైటిల్ సజ్జెస్ట్ చేసింది నేనే అని, ఈ సినిమాలో తనకు ఓ పాత్ర చేసే అవకాశం వచ్చిందని, అయితే చేయడం ఇష్టం లేక తిరస్కరించినట్లు తెలిపారు.

అవతార్ టైటిల్ గురించి గోవింద ఏమన్నారంటే
ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవింద మాట్లాడుతూ...‘అవతార్ సినిమా టైటిల్ ఇచ్చింది నేనే. అది సూపర్ హిట్ అయింది. ఆ సినిమా బాగా ఆడుతుందని జేమ్స్ కామెరూన్‌కు అప్పుడే చెప్పాను. ఆ సినిమా పూర్తి చేయడానికి 7 సంవత్సరాల సమయం పడుతుందని చెబితే ఆయనకు కోపం వచ్చింది. 7 సంవత్సరాలు తీస్తానని నువ్వెలా చెప్పగలవు? అంటూ నన్ను ఎదురు ప్రశ్నించాడు. నువ్వు అనుకుంటున్నది సినిమాగా తీయడం ఇంపాజిబుల్ అని చెప్పాను. ఆయన అవతార్ పేరు పెట్టి ఏలియన్స్ చూపించాడు' అని గోవింద చెప్పుకొచ్చారు.

అందుకే ఆఫర్ రిజక్ట్ చేశా
అవతార్ మూవీలో ఓ పాత్ర కూడా జేమ్స్ కామెరూన్ ఆఫర్ చేశాడు. 410 రోజులు నా డేట్స్ కావాలన్నాడు. నా లాంటి వ్యక్తికి బాడీ మొత్తం పేయింటింగ్ వేసుకుని నటించడం సాధ్యం కాదు అని చెప్పాను. కానీ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పినట్లు గోవిందా గుర్తు చేసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే హాలీవుడ్ మూవీ అవతార్ వచ్చిన మూడేళ్లకు 2012లో గోవిందా ‘అవతార్' అనే హిందీ సినిమా చేశాడు. అయితే అది విడుదల కాలేదు.
|
గోవిందపై ట్రోల్స్
‘అవతార్' టైటిల్ నేనే ఇచ్చాను అని చెప్పిన గోవిందా మీద సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. అవతార్ సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు కానీ... ఎలాంటి పాత్ర మీకు ఆఫర్ చేశారో చెప్పడం లేదంటూ అంటూ ప్రశ్నిస్తున్నారు.
|
గోవిందను ఎగతాళి చేస్తూ కామెంట్స్
మరి కొందరైతే గోవిందాను ఎగతాళి చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అవతార్ సినిమాలో ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశాను అని గోవిందా చెబుతున్నారు... నా కూడా ఐరన్ మ్యాన్ సినిమాలో ఆపర్ వచ్చింది, ఇష్టం లేక రిజెక్ట్ చేశాను... అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.