ఆ ఇద్దరూ వచ్చారు, అది తప్ప ఏమీ గుర్తులేదు: శ్రీదేవి మరణంపై జాహ్నవి
అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారత దేశం వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను బాధించింది. కొందరు ఫ్యాన్స్ ఇప్పటికీ ఆ విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వీరే ఇలా ఉంటే... కుటుంబంలో, ముఖ్యంగా శ్రీదేవి కూతుళ్లలో ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2018లో 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తల్లికి సంబంధించిన జ్ఞాపకాలు పంచుకున్నారు. తాను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని తెలిపారు.

నాలుగు నెలలు ఏం జరిగిందో తెలియదు
హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అమ్మ చనిపోయిన తర్వాత మూడు నాలుగు నెలలకు సంబంధించిన విషయాలన్నీ మరిచిపోయాను. ఏం జరిగిందో కూడా గుర్తు లేదు. ఏ పని చేస్తున్నా అమ్మజ్ఞాపకాలు వెంటాడుతున్నాయని జాహ్నవి తెలిపారు.

మాలో ప్రవహించేదంతా ఒకటే రక్తం
శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్ కుటుంబం అంతా ఒక్కటయ్యారు. అప్పటి వరకు అంటీ ముట్టనట్లుగా ఉన్న బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రెండో భార్య శ్రీదేవి పిల్లలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ దగ్గరయ్యారు. దీనిపై జాహ్నవి స్పందిస్తూ... మాలో ప్రవహించేదంతా ఒకటే రక్తమని తెలిపారు.

ఆ ఇద్దరూ వచ్చిన విషయం గుర్తుంది
అమ్మ చనిపోయిన తర్వాత నాలుగు నెలలు ఏం జరిగిందో గుర్తు లేదు కానీ.... నేను హర్ష భయ్య(అనిల్ కపూర్ కుమారుడు) రూములో కూర్చున్నపుడు అర్జున్ భయ్యా, అన్షులా దీదీ వచ్చారు. ఆ విషయం మాత్రమే గుర్తుంది. వారు మాతో కలవడంతో ఇక అంతా సవ్యంగా ఉంటుంది, ఓకే అని ఫీలైనట్లు చెప్పిన జాహ్నవి... అమ్మ చనిపోయినపుడు ఇద్దరూ ఎంతో సపోర్టుగా ఉన్నారని తెలిపారు.

జాహ్నవి కపూర్
శ్రీదేవి మరణించిన తర్వాత తన సోదరి ఖుషీ కపూర్ బాధ్యతలను జాహ్నవి చూసుకుంటున్నారు. ప్రస్తుతం జాహ్నవి కపూర్ ‘తక్త్', ‘రణ్ భూమి' సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా నటన వైపు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











