For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంగనా రనౌత్ చెల్లెలు నోటి దురుసు.. ఇబ్బందుల్లో డైరెక్టర్ రాఘవేంద్రరావు కొడుకు..

|

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్, జర్నలిస్టులకు మధ్య రంగిలిన వివాదం మరింత పెద్దగా మారుతోంది. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కంగనా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ప్రమోషన్లో ఓ జర్నలిస్టుతో కంగనా గొడవ పడటం తెలిసిందే.

కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పే వరకు ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను బహిష్కరిస్తామని జర్నలిస్టులంతా ఆందోళనకు దిగారు. ఈ మేరకు కొందరు చిత్ర నిర్మాత ఏక్తా కపూర్‌ను కూడా కలిసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.

క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్న రంగోళి

తన సోదరి ఏం చేసినా ఆమెకు పూర్తి మద్దతుగా ఉండే రంగోళి చండేల్ తాజా వివాదంపై స్పందించారు. కంగనా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పదని, ఆమె నుంచి అలాంటివేమీ ఊహించవద్దని స్పష్టం చేశారు. తన సోదరి ఏ తప్పూ చేయలేదని, అలాంటపుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు.

కంగనా మీడియాను సెట్ రైట్ చేస్తోంది

‘‘తన సోదరి మీడియాను సెట్ రైట్ చేస్తోంది, వారు సక్రమంగా ప్రవర్తించలేదు. అందుకే అలా సమాధానం చెప్పింది. నేను ప్రామిస్ చేస్తున్నాను... కంగనా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పదు. ఆమె అసలు క్షమాపణలు చెప్పే రకం కాదు. మీరు రాంగ్ పర్సన్‌ను అపాలజీ అడుగుతున్నారు'' అని రంగోళి ట్వీట్ చేశారు.

అసలు ఏం జరిగింది?

ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో.... ఓ జర్నలిస్ట్ కంగనా నటించిన 'మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' మూవీ ప్రస్తావన తేవడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ''మణికర్ణిక విషయంలో నేను ఏం తప్పు చేశాను? జాతీయత గురించి సినిమాతీయడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడిన సంగతి తెలిసిందే. కంగనా తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించింది అంటూ మీడియా ప్రతినిధులంతా ఆందోళన చేపట్టారు.

జడ్జిమెంటల్ హై క్యా

కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జడ్జిమెంట్ హై క్యా'. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, ఆయన భార్య కనికా థిల్లాన్ కథ అందించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. జులై 26న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.

సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇబ్బందులో రాఘవేంద్రరావు కొడుకు మూవీ

కంగనా రనౌత్ వివాదం సినిమా రిలీజ్ వేళ ఓపెనింగ్స్ పరంగా ఎఫెక్ట్ చూపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అదునుగా కంగనా వ్యతిరేకులు సైతం సినిమాపై నెగెటివ్ ప్రచారం ప్రారంభించారట. కంగనా విషయంలో జర్నలిస్టులను రెచ్చగొడుతున్నది కూడా వారే అని టాక్.

English summary
Two days after Kangana Ranaut had an ugly fight with a PTI reporter at the song launch event of 'Judgemental Hai Kya', the Entertainment Journalists' Guild of India has decided to boycott the actress, a delegation from the group told Ekta Kapoor. "Kangana will set the media right. I promise Kangana won't apologise, you have asked the wrong person for an apology." Rangoli tweeted.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more