»   » ‘నా సినిమాలన్నీ హిట్టయితే నా భార్య దూరం అయ్యేది’

‘నా సినిమాలన్నీ హిట్టయితే నా భార్య దూరం అయ్యేది’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'వికీ డోనర్' చిత్రం ద్వారా బాలీవుడ్లో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నటుడు ఆయుష్మాన్ ఖురానా రోటీన్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ నటుడిగా పత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది 'బరేల్లీకి బర్ఫీ', 'శుభ్ మంగళ్ సావధాన్' లాంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ఈ యంగ్ హీరో.... ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం 'షూట్ ది పియానో ప్లేయర్', 'బద్దాయ్ హో' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఓ లీడింగ్ మేజగైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

  మొదటి సినిమా తర్వాత వ్యక్తిగత జీవితంపై ప్రభావం

  మొదటి సినిమా తర్వాత వ్యక్తిగత జీవితంపై ప్రభావం

  వరుస విజయాలు, ఫేమ్ రావడం మీ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ చూపాయా? అనే ప్రశ్నకు ఆయుష్మాన్ స్పందిస్తూ ‘తొలి సినిమా తర్వాత నా పర్సనల్ లైఫ్ మీద చాలా ప్రభావం పడింది. నా ఫ్యామిలీకి టైమ్ కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మా కాపురంలో కొన్ని విబేధాలు వచ్చాయి అని ఆయుష్మాన్ తెలిపారు.

  ఐదేళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు

  ఐదేళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు

  ఐదేళ్ల నా సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. విజయాలు, అపజయాలు పలకరించాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాను. వీటి వల్ల జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని ఆయుష్మాన్ తెలిపారు.

   అన్ని హిట్టయితే నా భార్య వదిలేసేది

  అన్ని హిట్టయితే నా భార్య వదిలేసేది

  నాజాయితీగా చెప్పాలంటే.... నా సినిమాలన్నీ హిట్టయి ఉంటే నా భార్య తాహిరా నన్ను వదిలేసేది. ఇపుడు నేను చాలా మారిపోయి ఉండేవాడిని. అలా జరుగక పోవడానికి కారణం నా భార్య నాకు అన్ని సందర్భాల్లో తోడుగా ఉంది, కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకుంది. అందుకే మేము ఇంకా కలిసి ఉన్నాం అని ఆయుష్మాన్ తెలిపారు.

  ఫ్యామిలీ ఎంతో ముఖ్యం

  ఫ్యామిలీ ఎంతో ముఖ్యం

  ఒక వ్యక్తిని ఫ్యామిలీ అనేది ఎంతో ముఖ్యం. మనకు చివరి వరకు తోడుండేది కుటుంబం మాత్రమే. దీన్ని నమ్ముకుని ముందుకు సాగితే జీవితాంతం ఎంతో ధైర్యంగా ఉండొచ్చు అని ఆయుష్మాన్ ఖురానా తెలిపారు.

  మొదట్లో చాలా ఫీలయ్యేది

  మొదట్లో చాలా ఫీలయ్యేది

  నా చుట్టూ ఫీమేల్ అటెన్షన్ చూసి మొదట్లో నా భార్య చాలా ఫీలయ్యేది. అసహనానికి గురయ్యేది. అయితే ఇపుడుచాలా మారింది. త్వరలో ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించబోతోంది. దీని తర్వాత ఓ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించబోతోంది. ఆమె కూడా నటిగా మారడం వల్ల ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతోంది అని ఆయుష్మాన్ తెలిపారు.

  English summary
  During an interview with a leading magazine, when asked if fame affects his personal life, Ayushmann said, ''After the first film, our personal life was affected. I had no time for my family. You begin to feel big, your ego swells. Then I got back on track. It’s great to see both sides in these five years. The highs and the lows. Personally and professionally, it has made me balanced. It gives you a better perspective of life. Honestly, had all my films been successful, my wife would have left me. I would have been a different person. She has been with me through thick and thin. That is why we are together. Of course, you do get attracted to people. But your core needs to be right. The belief that you are with this person for a lifetime and you have to be with the family. That is the only thing, which will last forever.''
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more