Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సెక్సువల్ హరాస్మెంట్, వేటు పడింది: ఇక ఏ దర్శకుడైనా వణికి పోవాల్సిందే!
ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఏ) బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌ను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హీరోయిన్లను సెక్సువల్‌గా వేధించాడని అతడిపై ఆరోపణలు రావడంతో ఐఎఫ్‌టిడిఏ వేటు వేసింది.
సాజిద్ ఖాన్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నటి రీచెల్ వైట్, అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా, జర్నలిస్ట్ కృష్ణ ఉపాధ్యాయ్... మీటూ ఉద్యమంలో భాగంగా సాజిద్ ఖాన్ వేధింపుల గురించి వెల్లడించారు.

సాజిద్ ఖాన్ వేధింపులపై ఐఎఫ్‌టిడిఏ
ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ (పోష్)యాక్ట్ కింద ఫిర్యాదు దారులను కమిటీ విచారింది. అతడి లైంగిక వేధింపులు చాలా దారుణంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు కమిటీకి తెలిపారు. అనంతరం సాజిద్ ఖాన్ మీద సంవత్సరం పాటు సస్పెన్సన్ విధించడం జరిగింది అని ఐఎఫ్‌టిడిఏ ప్రతినిధులు తెలిపారు.

సాజిద్ ప్రవర్తన సరిగా లేదు
తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అతడికి అవకాశం ఇచ్చినా.... సాజిద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో కొన్ని సందర్భాల్లో కూడా మహిళల పట్ల అతడు ఎలా వ్యవహరించే తీరు సరిగా లేదని తేలిందని కమిటీ వెల్లడించింది.

ఆ సినిమా నుంచి తొలగింపు
ఈ ఆరోపణల నేపథ్యంలో ‘హౌస్‌ఫుల్ 4' సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి సాజిద్ ఖాన్‌ను ఇప్పటికే తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పర్హాద్ సమ్జిని తీసుకుని సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ కేసులో అక్షయ్ కుమార్, పర్హాన్ అక్తర్ లాంటి వారు సైతం బాధితులకు సపోర్టుగా నిలవడం గమనార్హం.

వణికి పోవాల్సిందే
#మీటూ ఉద్యమంలో భాగంగా తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద ఆరోపణలు చేసిన తర్వాత ఈ మూమెంట్ మరింత బలపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాజిద్ ఖాన్‌తో పాటు మరికొందరు ప్రముఖులపై ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ కేసుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతుండటంతో.... ఇలాంటి తప్పులు చేయాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది.