»   » కామాంధుడిని బయటకు ఈడ్చారు, రాత్రికి రమ్మనేవారు చాలా మందే..షాకిచ్చిన ఇలియానా!

కామాంధుడిని బయటకు ఈడ్చారు, రాత్రికి రమ్మనేవారు చాలా మందే..షాకిచ్చిన ఇలియానా!

Subscribe to Filmibeat Telugu
కామాంధుడిని బయటకు ఈడ్చారు!! రాత్రికి రమ్మనేవారు.. షాకిచ్చిన ఇలియానా!

నడుము సుందరి ఇలియానాకు బాలీవుడ్ కు వెళ్ళాక బాగ ధైర్యం ఎక్కువైపోనట్లు ఉంది. ఇటీవల కాలంలో ఇలియానా చేస్తున్న సంచలన వ్యాఖ్యలని గమనిస్తే అలాగే అనిపిస్తుంది. ఆ మధ్యన సౌత్ వాళ్ళుకు హీరోయిన్ల అందంతో తప్ప మరేం పనిలేదు అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా బాలీవుడ్ లో సెగలు పుట్టించే కామెంట్లు చేసింది. ఇలియానా, అజయ్ దేవ్ గన్ కలసి నటించిన రైడ్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇలియానా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది.

 టాలీవుడ్ లో ఒక ఊపు ఊపింది

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపింది

దేవదాసు, పోకిరి చిత్రాలలో ఇలియానా నడుము సొగసుకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. అప్పటినుంచి యువత ఇలియానా జపం చేయడం మొదలుపెట్టారు.

లైఫ్ ఇచ్చిన వారిపైనే విమర్శలు

లైఫ్ ఇచ్చిన వారిపైనే విమర్శలు

ఈ గోవా బ్యూటీని వైవిఎస్ చౌదరి దేవదాసు చిత్రంతో తెలుగువారికి పరిచయం చేసాడు. పోకిరి చిత్రంలో ఇలియానా నడుము అందాలని పూరి జగన్నాధ్ మరింత అందంగా చూపించాడు. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఇలియానా తనకు లైఫ్ ఇచ్చిన వైవిఎస్ చౌదరిపైనే కామెంట్లు చేయడం అందరికి షాక్ ఇచ్చింది.

 తక్కువ సమయంలోనే

తక్కువ సమయంలోనే

తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా ఇలియానా తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎదిగింది. పోకిరి చిత్రం తరువాత ఇలియానాకు వరుస అవకాశాలు పలకరించాయి.

క్రేజ్ మొత్తం మటాష్

క్రేజ్ మొత్తం మటాష్

బాలీవుడ్ పై మోజుతో ఇలియానా ఉత్తరాదికి వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకటి రెండు చిత్రాలతోనే ఇలియానా హవా ఆగిపోయింది.

 వివాదాస్పద కామెంట్లు

వివాదాస్పద కామెంట్లు

ఇలియానాని అభిమానులు సైతం మరచిపోతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెరలేపింది. అప్పుడుడప్పుడు మాత్రమే అవకాశాలు అందుకుంటున్న ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది.

 కాస్టింగ్ కౌచ్ పై ఘాటు వ్యాఖ్యలు

కాస్టింగ్ కౌచ్ పై ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల సౌత్ చిత్ర సీమపై కామెంట్లు చేసిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో కూడా చెడు మనస్తత్వం కలిగిన హీరోలు చాలా మంది ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధించే హీరోలు నాతోపాటు చాలా మంది హీరోయిన్లకు తెలుసు. కానీ ధైర్యం సరిపోక ఎవరూ పేర్లు బయట పెట్టడానికి ముందుకు రావడం లేదని ఇలియానా తెలిపింది.

పేర్లు బయటపెడితే

పేర్లు బయటపెడితే

పేర్లు బయటపెట్టాలని ప్రయత్నించినా, స్టార్ హీరోల గురించి బాలీవుడ్ లో వ్యతిరేకంగా మాట్లాడినా ఆ హీరోయిన్ల కెరీర్ అంతటితో ముగిసిపోతుందని ఇలియానా తెలిపింది. రైడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇలియానా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

 ఇలియానాలాగే రిచా చద్దా కూడా

ఇలియానాలాగే రిచా చద్దా కూడా

గత ఏడాది హాట్ బ్యూటీ రిచా చద్దా కాస్టింగ్ కౌచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లని వేధించే వారి వీరి పేర్లు నాకు తెలుసు అని కానీ తన కెరీర్ కు ఎటువంటి డోకా లేదని హామీ ఇవ్వగలిగితే వారి పేర్లు బయటపెడతా అని మాట్లాడి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇలియానా కూడా వ్యాఖ్యలు చేయడం విశేషం.

 హాలీవుడ్ కామాంధుడిని బయటపెట్టారుగా

హాలీవుడ్ కామాంధుడిని బయటపెట్టారుగా

హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత హార్వీ వైన్ స్టైన్ చీకటి కోణాన్ని హీరోయిన్లంతా కలసి బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

 అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా

అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా

అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారని ఇలియానా తెలిపింది. హాలీవుడ్ హీరోయిన్లంతా కలసి కామాంధుడిని బయటకు ఈడ్చారు. కానీ ఇక్కడకి వాళ్ళు ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ఇలియానా ప్రశ్నించింది. తన వల్ల మాత్రమే ఇది సాధ్యం కాదని, అందరూ కలిస్తే బాలీవుడ్ లో జరుగుతున్న చీకటి కోణాల్ని వెలుగులోకి తీయవచ్చని ఇలియానా పేర్కొంది.

English summary
Ileana shocking comments on casting couch. Ileana bussy with Raid movie promotions
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu