శ్రీదేవికి నివాళి పేరుతో అవమానం.. బయటపడ్డ కాపీ దొంగల వ్యవహారం!
ప్రపంచ సినివేదిలపై కూడా నివాళులు పొందేలా కీర్తి ప్రతిష్టలు సంపాదించింది అతిలోక సుందరి శ్రీదేవి. ఆస్కార్ వేదికపై కూడా శ్రీదేవి నివాళులు అర్పించారు. శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరి 24 న అకస్మాత్తుగా దుబాయిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణంతో ప్రతి సినీ వేదికపై ఆమెని గుర్తుచేసుకుంటున్నాం. ఇటీవల ఐఫా అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ ప్రదర్శించిన దృశ్యాలు ఇంటర్ నెట్ లో వివాదంగా మారాయి.

విమర్శల వర్షం
ఐఫా అవార్డుల్ వేడుక గత వారం టీవీల్లో ప్రదర్శించబడింది. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ పలు వీడియోలు ప్రదర్శించారు.ఐఫా లాంటి భారీ వేడుకలు నిర్వహించే సమయంలో కొత్తగా ఆలోచించాల్సింది పోయి ఇలా మరొకరి వీడియోలని కాపీ చేస్తారా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అసలు విషయం
ఐఫా వేడుకలో శ్రీదేవికి నివాళులు అర్పిస్తూ ప్రదర్శించిన వీడియోలు తాను రూపొందించనవి అని సబా అనే యువతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను రూపొందించిన వీడియోల్ని పోస్ట్ చేసింది.
బ్యాగ్రౌండ్ వాయిస్
కేవలం బ్యాగ్రౌండ్ వాయిస్ మాత్రం మార్చి వీడియోల్ని అలాగే కాపీ చేసారు. దీనితో ఐఫా నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ యువతికి క్రెడిట్ కూడా ఇవ్వలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆమెకు క్రెడిట్ ఇవ్వండి
ఈ వ్యవహారంపై ప్రముఖ నటి సోఫీ చౌదరి సోషల్ మిడియా వేదికగా స్పందించింది. ఇది కనుక నిజమైతే నిజంగా అన్యాయమే. ఐఫా నిర్వాహకులు ఈ సమస్యని పరిష్కరించి సబాకు న్యాయం జరిగేలా చూడాలని సోఫీ కోరింది.


Click it and Unblock the Notifications











