ముంబైకి ఎప్పుడొస్తానో తెలీదు.. మృత్యువుతో పోరాడుతున్న ఇర్ఫాన్!

By Rajababu

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధికి గురై లండన్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన కార్వాన్ చిత్రం ఆగస్ట్ 3న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

ఇటీవల బాలీవుడ్ పత్రికతో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాను. ముంబైకి ఎప్పుడు తిరిగి వస్తానో కచ్ఛితంగా చెప్పలేను. మళ్లీ ఎప్పడు షూటింగ్‌లకు హాజరవుతానో క్లారిటీ లేదు. ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. ఆ తర్వాత కెరీర్‌పై నిర్ణయం తీసుకొంటాను అని ఇర్ఫాన్ అన్నారు.

Irrfan Khan: Ive no idea when Im back to mumbai

ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కార్వాన్ చిత్ర ప్రమోషన్‌కు దూరంగా ఉన్నారు. డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా, దుల్కర్ సల్మాన్, చిత్ర యూనిట్ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇర్ఫాన్ జీవితంలో ఓ సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లేకుండానే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అని అన్నారు.

Irrfan Khan: Ive no idea when Im back to mumbai

బెంగళూరు నుంచి కోచికి జరిగే ప్రయాణం నేపథ్యంగా కర్వాన్ చిత్రం తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్, క్రితి ఖుర్బందా, మితిలా పాల్కర్ తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X