బలవంతంగా అబార్షన్.. 25 నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్.. రెండో భార్యపై స్టార్ హీరో దారుణంగా!
భోజ్‌పురి భాషకు సంబంధించిన సినీ రంగంలో పవర్ స్టార్ అనే పేరు ఉన్న స్టార్ హీరో పవన్ సింగ్ దాంపత్య జీవితం జాతీయ మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా విడాకుల వివాదం కోర్టు కేసులు, పోలీసుల కేసు వరకు వెళ్లింది. అయితే ఆయన నుంచి భారీగా భరణాన్ని ఆశిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో భోజ్‌పురి పవర్ స్టార్‌పై ఆయన రెండో భార్య చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
భోజ్‌పురి భాషలో పవర్ స్టార్‌గా పాపులారిటీ ఉన్న యాక్టర్, పొలిటిషియన్ పవన్ సింగ్ విడాకుల కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. గత కొద్దికాలంగా భార్య జ్యోతి సింగ్ ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తూ మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించారు. అయితే ఆయన బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో, అలాగే ఆయన కీలకంగా మారిన ఎలక్షన్ సమయంలో జ్యోతిసింగ్ భారీగా అంటే 30 కోట్ల రూపాయల భరణం చెల్లించాలంటూ బాంబు వేశారు.

ఇక మొదటి భార్య మరణం తర్వాత జ్యోతి సింగ్‌కు మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యారు. అయితే 2018 సంవత్సరంలో జ్యోతి సింగ్. పవన్ సింగ్ వివాహం జరిగింది. అయితే త్వరలోనే వారి వైవాహిక జీవితంలో కలతలు చెలరేగాయి. భర్తపై ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. తన మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. రెండుసార్లు నన్ను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది. వాటిని ఆయన ఖండించడం మరింత వివాదంగా మార్చింది.
అయితే ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జ్యోతి సింగ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఆయన నుంచి వస్తున్న వేధింపులు తట్టుకోలేక తాను 25 నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌కు ప్రయత్నం చేశాను అంటూ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఆరోపణలను పవన్ తిప్పి కొట్టేందుకు ప్రయత్నించారు.

తాజాగా పవన్ సింగ్‌పై భార్య జ్యోతి సింగ్ రెండు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేసింది. బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో ఆమె క్రిమినల్ కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఆమె దాఖలు చేసిన కేసుల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో బీహార్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, వివాదం జాతీయ మీడియాలో కేంద్ర బిందువుగా మారడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
పవన్ సింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అష్‌నీర్ గ్రోవర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రైస్ అండ్ ఫాల్ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఆయన ఇటీవల వివాదాస్పద నటి ధనశ్రీ వర్మతో డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. అలాగే ఆమెకు పింక్ చీర బహుమతిగా ఇవ్వడం కూడా అందర్నీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.


Click it and Unblock the Notifications











