For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Farhan Akhtar రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రియురాలు.. మూడేళ్లుగా ఆ రిలేషన్‌తో

  |

  బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, డిస్టిబ్యూటర్ ఫర్హాన్ అఖ్తర్ రొమాంటిక్ లైఫ్ మరోసారి చర్చనీయాంశమైంది. గత మూడేళ్లుగా శిభానీ దండేకర్‌తో ఫర్హాన్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో అడపాదడపా వైరల్ అవుతూ నెటిజన్లకు పండుగలా మారుతున్నాయి. అయితే ఈ రొమాంటిక్ జంట మరోసారి మీడియాలో హైలెట్‌గా మారింది. వీరి రిలేషన్‌షిప్ మరో అడుగు ముందుకెళ్లే అవకాశం ఉందనే వార్త విస్తృతంగా ప్రచారమైంది.

  అయితే చాలా రోజుల నుంచి ఫర్హాన్, శిభానీ దండేకర్ ఎప్పుడూ పెళ్లి వార్త చెబుతారనే వేచి చూస్తున్న అభిమానులకు సంతోషకరమైన వార్త మీడియాలో వినిపించింది. వీరిద్దరూ సహజీవనం వీడి దంపతులు కాబోతున్నారనే వార్త వైరల్ అవుతున్నది. మూడు సంవత్సరాల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోని వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సిద్ధమవుతున్నారు అనే విషయం మీడియాలో రావడంతో అభిమానుల ఆనందపడిపోయారు.

  Is Farhan Akhtar and Shibani Dandekar marriage on cards?

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  అయితే పెళ్లి వార్తతో జోష్‌లో ఉన్న అభిమానుల ఆశలపై ఫర్హాన్ అఖ్తర్ నీళ్లు చెల్లారు. అయితే మా పెళ్లి వార్త ఇప్పట్లో వినే అవకాశం లేదు. మీడియాలో వస్తున వార్తల్లో వాస్తవం లేదు అని శిభానీ స్పష్టం చేసింది. ప్రతీ ఒక్కరు పెళ్లి ఎప్పుడని పదే పదే అడుగుతున్నారు. మా ఇద్దరి మధ్య అలాంటి టాపిక్ రాలేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటే తప్పకుండా మీకు సమాచారం అందిస్తాను. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు అని శిభానీ స్పష్టం చేసింది.

  గ్లామర్ తో మరోసారి రెచ్చగొడుతున్న వర్షిని.. హాట్ యాంకర్స్ కు పోటీగా ఘాటైన స్టిల్స్

  ఫర్హాన్ అఖ్తర్, శిభానీ డేటింగ్ విషయానికి వస్తే.. 2018 నుంచి వారిద్దరు అఫైర్‌లో ఉన్నారు. తమ డేటింగ్ విషయాన్ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. అయితే వారిద్దరూ సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫర్హాన్ అఖ్తర్ విషయానికి వస్తే.. గతంలో అధునా భబానీతో వివాహం జరిగింది. వారిద్దరికి షక్యా, అఖీరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో ఫర్హాన్, అధునా విడిపోయారు. అప్పటి నుంచి శిభానీతో డేటింగ్ చేస్తున్నారు.

  Sai Pallavi ని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

  ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో డిస్టిబ్యూటర్‌గా బిజీగా ఉన్నారు. సైరా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేశారు. ఇటీవల బాక్సింగ్ క్రీడా నేపథ్యంగా తుఫాన్ అనే చిత్రంలో నటించారు. మృణాల్ థాకూర్, పరేశ్ రావల్ నటించిన ఈ చిత్రానికి రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Farhan Akhtar and Shibani Dandekar marriage news goes viral in the media. But Shibani Dandekar given clarity that, we are not yet decided.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X