Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
జాకెట్ విప్పేసిన ప్రియాంక చోప్రాను... పరువు తీశావంటూ ఎడా పెడా వాయించేశారు!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల 'ఇన్ స్టైల్' అనే యూఎస్ మేగజైన్ కోసం చీర కట్టులో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చీర కట్టు వరకు ఒకే కానీ... జాకెట్ ధరించకుండా టాప్ లెస్ ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటో షూట్ వివాదాస్పదం అయింది.
మన భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీరకట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం బాగానే ఉంది కానీ జాకెట్ ధరించకుండా ఇలా అసభ్యంగా ప్రజెంట్ చేయడం ఏం బాగోలేదని పలువురు నెటిజన్లు మండి పడుతున్నారు. ఈ విషయంలో ప్రియాంక చోప్రాపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.
టాప్ లెస్ ఫోజులు ఇచ్చుకో... కానీ పరువు తీయకు
నువ్వు టాప్ లెస్ ఫోజులు ఇచ్చినా, మరేరకంగా ఫోజులు ఇచ్చుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అది నీ వ్యక్తిగతం. అయితే భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీరకట్టును ప్రజెంట్ చేసేపుడు సరైన పద్దతిలో చేయ్. జాకెట్ విప్పేసి చీర కట్టు పరువు తీసే పని మాత్రం చేయకు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
కల్చర్ తప్పుతోవ పట్టించడమే
ప్రియాంక చోప్రా చర్య భారతీయ సంస్కృతిని తప్పుతోవ పట్టించే విధంగా ఉందని మరికొందరు అంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియన్ సారీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపును చెడగొట్టే విధంగా ఆమె ప్రవర్తించింది, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోద యోగ్యం కాదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వల్గారిటీ ఏమీ లేదంటున్న డిజైనర్
ఈ ఫోటో షూట్లో ప్రియాంక చోప్రా ధరించిన చీరను తరుణ్ తహిల్యానీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అయితే జాకెట్ లేకుండా ప్రియాంక చోప్రా ఫోజులు ఇవ్వడంపై ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటో షూట్లో వల్గారిటీ ఏమీ లేదని సమర్ధించుకున్నట్లు సమాచారం.
అభిమానుల మద్దతు
ప్రియాంక చోప్రాను విమర్శించే వారు ఒక వైపు ఉండగా.... ఆమెకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఆ ఫోటో షూట్లో ప్రియాంక చాలా అందంగా కనిపించిందని, కొంపలు మునిగిపోయినట్లు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.