Malaika Arora అర్జున్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్.. స్టార్ హీరోయిన్ అండతో మ్యారేజ్ ఎప్పుడంటే?

మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారం గత నాలుగేళ్లుగా బాలీవుడ్ మీడియాను కుదిపేస్తున్నది. వారిద్దరి రొమాన్స్‌ను మీడియా కథకథలుగా చచెప్పింది. అయితే 2019 నుంచి సాగుతున్న ఇద్దరి అఫైర్‌కు త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలైకా, అర్జున్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం..

అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వారిద్దరి మధ్య అఫైర్ నిజమైన ప్రేమకు చిహ్నంగా కనిపిస్తున్నది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ముంబైలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. శీతాకాలంలో వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది. వారిద్దరికి శీతాకాలం అంటే చాలా ఇష్టం. కాబట్టి వారిద్దరి పెళ్లి నవంబర్ చివరి వారంలో గానీ, డిసెంబర్‌లో గానీ జరిగే అవకాశం ఉంది. వారి పెళ్లి ప్రైవేట్ కార్యక్రమం అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరుగుతుంది అని ముంబై మీడియాలో ఓ కథనం చక్కర్లు కొడుతున్నది.

Is Malaika Arora getting marriage with Arjun Kapoor in November?

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. నిరాడంబరంగా పెళ్లి కార్యక్రమాన్ని ముగించి.. భారీగా వెడ్డింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య ఈ విందు జరుగుతుంది. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపేందుకు సిద్దమవుతున్నారు. ఈ వేడుకల్లో కపూర్ ఫ్యామిలీ మెంబర్స్, మలైకా తల్లిదండ్రులు, కరీనాకపూర్ అధ్వర్యంలో పెళ్లి జరుగుతుంది అని వెల్లడించారు.

అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య రిలేషన్‌లో వారి వయసు మధ్య ఉన్న తేడా మీడియాలో చర్చనీయాంశమైంది. అర్జున్ కపూర్ వయసు 36 సంవత్సరాలు కాగా, మలైకా అరోరా వయసు 48 సంవత్సరాలు. మలైకా మొదటి వివాహం సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో జరిగిన విషయం తెలిసిందే. వారిద్దరికి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X