Priyanka Chopra భర్తకు గుడ్‌బై? సమస్యల్లో మూడేళ్ల వైవాహిక జీవితం.. సమంత మాదిరిగానే..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి గ్లోబల్ ఐకాన్ స్థాయి వరకు ఎదిగిన ప్రియాంక చోప్రా వైవాహిక జీవితం సజావుగా సాగుతున్న సమయంలో సెన్సేషనల్ రూమర్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. భర్త నిక్ జోనస్‌తో విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్ ఇంటర్నేషనల్ మీడియాను కుదిపేసింది. అయితే ప్రియాంక చోప్రా అనుమానాస్పదంగా వ్యవహరించడమే గాసిప్‌కు ప్రధానంగా కారణంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
2018లో ప్రేమ వివాహం అంటూ

2018లో ప్రేమ వివాహం అంటూ

హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు అమెరికాకు వెళ్లిన ప్రియాంక చోప్రా సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. తన కంటే చిన్నవాడైనా నిక్‌తో విడదీయలేనంత ప్రేమలో కూరుకుపోయింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో హిందూ సంప్రదాయ పద్దతిలో నిక్ జోనస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకొన్నది. 2018 డిసెంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామిక వర్గాలు హాజరయ్యారు.

ఇటీవల న్యూయార్క్‌లో వైభవంగా దీపావళి

ఇటీవల న్యూయార్క్‌లో వైభవంగా దీపావళి

ఇటీవల న్యూయార్క్‌లోని తన నివాసంలో ఘనంగా దీపావళీ పండుగను జరుపుకొన్నది. తొలుత తన స్నేహితులతో కలిసి వేడుకను జరుపుకోగా, ఆతర్వాత జోనస్‌తో కలిసి ఇంటిలో పూజలు నిర్వహించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. తొలిసారి జోనస్‌తో కలిసి తొలిసారి దీపావళీ జరుపుకొన్నాను. ఈ దీపావళీ నాకు చాలా స్పెషల్. ఈ పండుగను స్పెషల్ చేసిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అంటూ పోస్టు పెట్టింది.

భర్తతో రొమాంటిక్ జీవితంతో

భర్తతో రొమాంటిక్ జీవితంతో

సింగర్ నిక్ జోనస్‌తో మూడేళ్ల వైవాహిక జీవితం బ్రహ్మండంగా సాగింది. బీచుల్లో, రెస్టారెంట్లలో, ద్వీపాలలో వారి విహార యాత్రలు, రొమాంటిక్ జీవితం క్రేజీగా సాగింది. వారి సన్నిహితంగా ఉన్న వారి ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతో అన్యోన్యంగా కనిపించిన వారి జీవితాల్లో విభేధాలు నెలకొన్నాయనే రూమర్ ఇప్పుడు మీడియాలో ఘాటుగా వినిపిస్తున్నది.

ప్రియాంక తన పేరు నుంచి జోనస్ తొలగిచండంతో

ప్రియాంక తన పేరు నుంచి జోనస్ తొలగిచండంతో

అయితే ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చేసుకొన్నది. అప్పటి నుంచి ఆమె ప్రియాంక చోప్రా జోనస్‌గా మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన పేరు నుంచి జోనస్‌ను తొలగించడంతో రూమర్లు సునామీలా మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

సమంత మాదిరిగానే ప్రియాంక చోప్రా

సమంత మాదిరిగానే ప్రియాంక చోప్రా

ఇటీవల కాలంలో టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, సమంత విడాకుల విషయం కూడా ఇలానే బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో సమంత తన పేరు నుంచి అక్కినేనిని తొలగించడంతో విడాకుల తీసుకొంటున్నారనే విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రియాంక కూడా తన పేరు నుంచి జోనస్ అని తొలగించుకోవడ అలాంటి ఘటన చోటు చేసుకొంటుందా అనే విషయం చర్చనీయాంశమైంది.

ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ఇలా..

ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ఇలా..

ప్రియాంక చోప్రా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. అవెంజర్‌ను రూపొదించిన జో, ఆంథోని రుస్పో నిర్మిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రిచర్డ్ మ్యాడెన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా టెక్ట్ ఫర్ యూ, ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్, జీ లే జరా అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X