»   »  షాహిద్ కపూర్ తమ్ముడు మనిషేనా..12 రోజుల్లో అంత బరువు ఎలా !

షాహిద్ కపూర్ తమ్ముడు మనిషేనా..12 రోజుల్లో అంత బరువు ఎలా !

Subscribe to Filmibeat Telugu

షాహిద్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. విలక్షణమైన పాత్రలతో షాహిద్ అభిమానులని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ అన్నని మించేలా ఉన్నాడు. తొలి చిత్రం కోసమా ఇషాన్ పడ్డ కష్టం గురించి తెలిస్తే అతడు అసలు మనిషేనా అనే అనుమానం కలగక మానదు. ఇది తిట్టడం కాదు. కేవలం 12 రోజుల్లో ఇషాన్ 8 కేజీల బరువు తగ్గాడని తెలిస్తే మీరు కూడా అదే మాట అంటారు.

Ishaan Khatter lost eight kgs in just 12 days for Beyond The Clouds movie

ఇషాన్ ప్రస్తుతం మజీద్ మజిదీ దర్శత్వంలో బియాండ్ ది క్లౌడ్స్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బియాండ్ ది క్లౌడ్స్ చిత్రంలో పాత్రకు తగ్గట్లుగా తన రూపుని మార్చుకోవడం కోసం ఇషాన్ కేవలం 12 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గాడు. ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో రోజూ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ కఠినంగా ఆహార నియమాలు పాటించాడు. తద్వారానే అతడు కేవలం 12 రోజుల్లో 8 కేజీల బరువు తగ్గాడని అంటున్నారు. ఇషాన్ డెడికేషన్ కు బాలీవుడ్ ప్రముఖులు ఔరా అంటున్నారు. బియాండ్ ది క్లౌడ్స్ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Ishaan Khatter lost eight kgs in just 12 days for Beyond The Clouds movie. Young hero dedication wows everyone
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X