twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Sood: వరుసగా మూడోరోజూ సోనూపై ఐటీ రైడ్స్.. అందుకే అంటున్న నెటిజన్లు!

    |

    లాక్ డౌన్లో రియల్ హీరోగా మారిన సోనూసూద్ ఇల్లు, కార్యాలయంతో సహా ఆరు ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు జరగడం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    అందుకే ఐటీ రైడ్స్

    అందుకే ఐటీ రైడ్స్


    లాక్ డౌన్ సమయంలో అనేక వందల మందిని అనేక రైళ్లు బస్సులు ఏర్పాటు చేసి ఇ తమ తమ సొంత ప్రాంతాలకు తరలించిన సోను సూద్ ఆ తర్వాత కూడా అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నాడు.. అలాంటి సోనూసూద్ మీద ఇప్పుడు వరుసగా ఐటీ రైడ్స్ జరగడం సంచలనంగా మారింది. ఈ రైడ్స్ లో సోనూ సూద్ వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన కేసులో పన్ను అవకతవకల గురించి ఐటీ శాఖకు తెలిసిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సినిమాల కోసం సోను తీసుకున్న డబ్బులో కూడా అక్రమాలు ఉన్నట్లు తెలిసిందని ఐటీ వర్గాలు చూచాయగా చెబుతున్నాయి ఈ లావాదేవీలే కాకుండా.. సోను ఛారిటీ ఫౌండేషన్ అకౌంట్ వివరాలు తీసుకుని కూడా ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వివరాలు బయటకు వస్తున్నాయి.

    ఈరోజు ముగిసే అవకాశం

    ఈరోజు ముగిసే అవకాశం

    ఈ దాడులు ఈరోజుతో ముగియవచ్చని, రేపు దీనికి సంబంధించి అధికారులు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత రెండు రోజుల నుంచి ఐటీ బృందాలు సోను ఎకౌంట్ పుస్తకాలు, ఆదాయం, ఖర్చులు, ఆర్థిక రికార్డులను తనిఖీ చేస్తున్నాయని గురువారం ఉదయం స్వల్ప విరామం తర్వాత, దర్యాప్తు బృందం సోనూ సూద్ కు చెందిన ముంబై, లక్నో ప్రదేశాలలో రికార్డులను చెక్ చేస్తోందని అని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం మేరకు ఇప్పటికే ఆదాయపు పన్ను
    అధికారులు సోను కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న సిబ్బందిని కూడా విచారించారనీ, సోను ఇంటి నుండి కొన్ని ఫైళ్లను కూడా తీసుకువెళ్లారని అంటున్నారు.

    ఫౌండేషన్ తో అండగా

    ఫౌండేషన్ తో అండగా


    సోనూ సూద్ కరోనా సమయంలో వేలాది మందికి సహాయం చేయగా 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' అనే ఎన్జీఓను కూడా నిర్వహిస్తున్నారు. నిజానికి కొన్ని రోజుల క్రితం, కేజ్రీవాల్ ప్రభుత్వం సోనును బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది.ఆగస్టు 27 న ఢిల్లీ ప్రభుత్వం సోనూను పాఠశాల విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉండేలాగా రూపొందించిన ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. ఈ సమయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పాల్గొంటారని ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే, ఇది కేవలం పిల్లల చదువు విషయంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి తన మద్దతు తెలిపానని తనకు రాజకీయాల్లో ఎలాంటి ఆసక్తి లేదని సోనుసూద్ క్లారిటీ ఇచ్చారు. ఆప్ పార్టీతో సోను కలవడం వల్లనే ఇలా ఆదాయపు పన్ను అధికారులు సోనూసూద్ మీద దృష్టి పెట్టారు అని పెద్ద ఎత్తున నెటిజన్ల విమర్శిస్తున్నారు..

    ఆస్తులు తాకట్టు పేట్టి

    ఆస్తులు తాకట్టు పేట్టి

    ఒక వెబ్ సైట్ వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం సోనూ సెప్టెంబర్ 2021 నాటికి, మొత్తం ఆస్తుల నికర విలువ 130 కోట్లు ($ 17 మిలియన్స్), అయితే ఆయన ఆస్తులను తాకట్టు పెట్టి మరి సహాయం చేస్తున్నారనే ప్రచారం ఉంది. బాలీవుడ్లో ఎదగాలనే ఉద్దేశంతో వచ్చిన ఆయన ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సోను తన కుటుంబంతో 2600 చదరపు అడుగుల ఒక నాలుగు బెడ్రూంలు గల అపార్ట్‌మెంట్‌ అంధేరిలో నివసిస్తున్నారు. ఈ ఫ్లాట్ కాకుండా, అతనికి ముంబైలో మరో రెండు ఫ్లాట్లు ఉన్నాయి.

    Recommended Video

    Maro Prasthanam Movie Trailer Launch | Tanish, Muskan Sethi | MS entertainments
    సోను ఆస్తుల విషయానికి వస్తే

    సోను ఆస్తుల విషయానికి వస్తే


    ఆయన స్వగ్రామం ఆయన పంజాబ్ రాష్ట్రంలోని మొగాలో ఒక బంగ్లా కూడా ఉంది. ఇవి కాకుండా ముంబైలోని జుహులో హోటల్ ఉంది. లాక్డౌన్ సమయంలో ఐసోలేషన్ సెంటర్ చేయడానికి అతను దానిని తెరిచాడు. అయితే సోనూసూద్ రాజకీయంగా ఒక పార్టీకి దగ్గర అవుతున్నారని ఆలోచనతోనే అధికార పార్టీ ఆయన మీద దృష్టి పెట్టిందని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రియల్ హీరో అంటే టక్కున గుర్తు వచ్చే సోనుని ఇలా ఐటీ దాడులతో దెబ్బ తీయడం సరికాదని అంటున్నారు.అయితే మరి దీనికి సంబంధించి ఐటీ శాఖ ఏమని ప్రెస్ నోట్ విడుదల చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    we all know IT department riding Sonu Sood house and some properties from past two days ride continuing on third day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X