For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొంచెం కూడా బాధ లేదా? ఈ వేషాలేంటి? శ్రీదేవి కూతురుపై దారుణమైన కామెంట్స్

  By Bojja Kumar
  |
  Janhvi Kapoor Gets Serious Comments From Tweeters

  ప్రముఖ నటి శ్రీదేవి తన కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా చూడాలని ఆశ పడింది. అయితే ఆ ఆశ తీరేలోపే ఈ లోకాన్ని విడిచి అందరినీ బాధ పెట్టింది. కొందరు అభిమానులైతే శ్రీదేవి విషాదం నుండి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో జాహ్నవి కపూర్ చర్యలు అభిమానులను అప్ సెట్ చేశాయి. జాహ్నవి వోగ్ కవర్ పేజీ కోసం ఫోజులు ఇవ్వడంపై శ్రీదేవి ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తూ విరుచుకుపడ్డారు. అమ్మ లేదనే బాధ జాహ్నవిలో ఏ మాత్రం కనిపించడం లేదని, ఈ విషాద సమయంలో ఇలాంటి పిచ్చివేషాలేయడానికి మనసెలా ఒప్పిందని సోషల్ మీడియాలో మండి పడ్డారు.

  జాహ్నవిలో ఏ మాత్రం బాధ లేదంటూ విమర్శలు

  జాహ్నవిలో ఏ మాత్రం బాధ లేదంటూ విమర్శలు

  తన తల్లి చనిపోయిన బాధ జాహ్నవిలో కొంచెం కూడా కనిపించడం లేదు. జాహ్నవి తీరు చూస్తుంటే తల్లి మరణాన్ని తన తొలిసినిమాకు సింపతీగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ కొందరు విమర్శలకు దిగారు.

  జాహ్నవి సర్జరీలు చేసుకుందంటూ

  జాహ్నవి సర్జరీలు చేసుకుందంటూ

  జాహ్నవి గత ఫోటోలకు, ఇప్పడు ఆమె కనిపిస్తున్న లుక్ చాలా భిన్నంగా ఉందని... వాటిని పరిశీలిస్తే జాహ్నవి ముక్కు, పెదాలకు సర్జరీలు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు.

  సపోర్టుగా నలిచిన మసాబా గుప్తా

  సపోర్టుగా నలిచిన మసాబా గుప్తా

  అయితే జాహ్నవిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న వారిపై ప్రముఖ కాస్టూమ్ డిజైనర్ మసాబా గుప్తా రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. జాహ్నవిని జడ్జ్ చేయడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు. జాహ్నవి కేవలం 22 సంవత్సరాల అమ్మాయి. ఇంత చిన్న వయసులో తన తల్లిపోయిన బాధను దిగమింగుకుని, ఆ బాధ పైకి కనిపించనివ్వకుండా ధైర్యంగా ముందుకు సాగుతోంది. జాహ్నవి నటి కావాలనేది కేవలం ఆమె కల మాత్రమే కాదు.... శ్రీదేవి కల కూడా, దాన్ని నిజం చేసేందుకు, తల్లిదండ్రులు గర్వపడేలా చేసేందుకు ఆమె ఎంతగానో కష్టపడుతోంది. ఆమెను ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని వ్యాఖ్యానించారు.

  పలుకుబడితో అవకాశం కొట్టేసింది

  పలుకుబడితో అవకాశం కొట్టేసింది

  ఎంతో మంది మోడల్స్ వోగ్ కవర్ పేజీ మీద కనిపించడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ జాహ్నవికి అలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఫ్యామిలీకి ఉన్న పలుకుబడితో ఈజీగా ఇలాంటి అవకాశాలు ఎన్నైనా కొట్టేయగలదు... అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

  అప్పుడే ఇంత అవసరమా?

  అప్పుడే ఇంత అవసరమా?

  జాహ్నవి కెరీర్లో ఎదిగేందుకు చాలా కష్టపడుతోంది, ఈ విషయాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ ఇంకా తొలి సినిమా విడుదల కాకముందే వోగ్ కవర్ పేజీపై అందాలు ఆరబోయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన ఫ్యామిలీ పలుకుబడిని జాహ్నవి బాగా వాడుకుంటోంది అంటూ కొందరు విమర్శలకు దిగారు.

  మీకెందుకు దురద అంటూ మరికొందరు సపోర్ట్

  మీకెందుకు దురద అంటూ మరికొందరు సపోర్ట్

  అయితే జాహ్నవిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని తప్పబడుతు కొందరు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఆమె జీవితం, ఆమె ఇష్టం. ఆమె సర్జరీలు చేసుకుంటే మీకెందుకు? ఇంకేదో చేస్తే మీకెందుకు? ఆమె ఎలాంటి తప్పు చేయడం లేదు, ఎవరికీ అన్యాయం చేయడం లేదు..... ఎందుకు జాహ్నవిపై మీ నోటి దురద ప్రదర్శిస్తున్నారంటూ మద్దుగా నిలిచారు.

   బాలీవుడ్లో నెపోటిజం చాలా ఉంది

  బాలీవుడ్లో నెపోటిజం చాలా ఉంది

  జాహ్నవి నటించిన తొలి చిత్రం ఇంకా విడుదల కాలేదు.... అప్పుడే ‘స్టార్ పుట్టింది' అంటూ ప్రచారం చేయడం హాస్వాస్పదం. కేవలం ఆమెకు ఉన్న ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్లే జాహ్నవికి ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి.... వోగ్ కవర్ పేజీపై ఆమె దర్శనమివ్వడంపై ఆశ్చర్య పరడాల్సిన అవసరం లేదంటూ కొందరు కామెంట్స్ చేశారు.

  ఇలా చేయడం అర్థం లేని పని

  ఇలా చేయడం అర్థం లేని పని

  ఏ ప్రాతిపదికన జాహ్నవిని స్టార్ అంటున్నారు? కేవలం ఆమె శ్రీదేవి కూతురు అయినందువల్లేనా? ఇది పూర్తిగా అసంబద్దమైన వ్యాఖ్యలు. ఆమె ముందు నటిగా తనను తాను నిరూపించుకోవాలి. అది జరుగక ముందే ఇలాంటి వ్యాఖ్యలు తగవు అంటూ మరికొందరు అభిప్రాయ పడ్డారు.

  English summary
  Sridevi's elder daughter Janhvi Kapoor graces the cover of Vogue for the first time and it seems fans are not at all happy to see that. While celebs like Sonam Kapoor, Deepika Padukone and Katrina Kaif have liked the Vogue cover, many Instagram users sounded 'disappointed' to see her on the cover page. And soon after the Vogue cover was live on Instagram, it was inundated with negative comments, targeting Janhvi Kapoor for 'plastic surgery' and 'nepotism'. Some of the users also tried to shame Janhvi Kapoor for being on the cover a few months after the death of her mommy Sridevi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more