»   »  శ్రీదేవి మరణానంతరం జాహ్నవి, ఖుషీ పరిస్థితి అలా మారిందట.. భగ్గుమనే స్థితి నుంచి..

శ్రీదేవి మరణానంతరం జాహ్నవి, ఖుషీ పరిస్థితి అలా మారిందట.. భగ్గుమనే స్థితి నుంచి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార శ్రీదేవి మరణానంతరం ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. శ్రీదేవి మృతి తర్వాత బోనికపూర్‌కు సంబంధించిన రెండు కుటుంబాలు ఒక్కటవుతున్నాయి. పుట్టెడు దు:ఖంతో ఉన్న జాహ్నవి, ఖుషీ ఇటీవల తండ్రి బోనితో కలిసి తన సోదరుడు అర్జున్ కపూర్ ‌నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాధలో ఉన్న తన చెల్లెల్లను అర్జున్ ఓదార్చినట్టు సమాచారం.

 భగ్గుమనే స్థితి నుంచి

భగ్గుమనే స్థితి నుంచి

శ్రీదేవీ ఫ్యామిలీకి, బోనికపూర్ తొలి భార్యకు సంబంధించిన పిల్లలకు మధ్య కొనేళ్లుగా పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పినతల్లి శ్రీదేవి అంటే బోనికపూర్‌కు విపరీతమైన ద్వేషం ఉండేది. శ్రీదేవితో బోని పెళ్లి తర్వాత తన తల్లి పడిన బాధ, కుటుంబం పడిన కష్టాలన్నీ అర్జున్‌ కపూర్‌కు చేదు అనుభవంగా మిగిలాయి.

Jahnavi Kapoor Gets Rumours With Her Co-Star
అర్జున్ కపూర్ అండ

అర్జున్ కపూర్ అండ

కానీ శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత ఇరు కుటుంబాలు దగ్గరయ్యాయి. శ్రీదేవి మృతివార్త వినగానే అర్జున్ కపూర్ వెంటనే తన చెల్లెళ్లు జాహ్నవి, ఖుషీ కపూర్లకు అండగా నిలిచారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకురావడానికి అర్జున్ దుబాయ్‌కి వెళ్లాడు.

బాధ్యతతో అర్జున్ కపూర్

బాధ్యతతో అర్జున్ కపూర్

శ్రీదేవి అంత్యక్రియల బాధ్యతను అర్జున్ కపూర్ స్వయంగా భుజాన వేసుకొన్నాడు. మీడియాలో ప్రతికూల కథనాలు వస్తున్న సమయంలో అన్నీతానై వ్యవహరించాడు. శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్ తన బాధ్యతను గుర్తు చేసుకొన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

కుటుంబంలో సఖ్యత

కుటుంబంలో సఖ్యత

శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత జాహ్నవి, ఖుషీ, అర్జున్, అన్షులా కపూర్ మధ్య మంచి సంబంధాలు నెలకొన్నట్టు బాలీవుడ్ పత్రికల కథనం. ఈ నేపథ్యంలో తండ్రితో కలిసి అర్జున్ కపూర్‌కు వెళ్లారు. అర్జున్ కపూర్ నివాసానికి వెళ్లిన సమయంలో బయటకు వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 దఢక్ చిత్రంతో

దఢక్ చిత్రంతో

జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కరణ్ జోహర్ నిర్మాణ సారథ్యంలో దఢక్ అనే చిత్రంలో జాహ్నవి నటిస్తున్నది. మరాఠీలో ఘన విజయం సాధించిన సైరత్ చిత్రానికి ఈ సినిమా రీమేక్. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నారు.

English summary
Sridevi's daughters, Janhvi and Khushi, have been bonding with step-brother and sister Arjun and Anshula Kapoor, after their mother's untimely death in February. Recently, Janhvi and Khushi, with dad Boney, were spotted at Arjun's house. The relationship between the children from Boney's first marriage with Sridevi's family, has evolved from being cold to cordial, over the years. Sridevi's death brought them closer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X