హానీమూన్ నుంచి అలా పారిపోయాడు.. భర్త గురించి కాజోల్!
Recommended Video

బాలీవుడ్ తారలు కాజోల్, అజయ్ దేవగన్ 1999లో ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారి దాంపత్య జీవితానికి 20 ఏళ్లు గడిచాయి. న్యాసా, యుగ్ అనే ఇద్దరు పిల్లలతో వారి జీవితం సంతోషంగా సాగుతున్నది. పెళ్లి తర్వాత సినిమాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. ప్రస్తుతం కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం హెలికాప్టర్ ఈలా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆ ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు.

హానీమూన్ కోసం వరల్డ్ టూర్
పెళ్లికి ముందే హనీమూన్ కోసం వరల్డ్ టూర్‌కు వెళ్దామని అజయ్ దేవగన్‌కు కాజోల్ కండిషన్ పెట్టింది. పెళ్లి చేసుకొన్న తర్వాత రెండు నెలలపాటు హానీమూన్‌కు వెళ్లాం. మొదట ఆస్ట్రేలియా నుంచి మొదలుపెట్టి లాస్ ఏంజెలెస్ ఆ తర్వాత లాస్ వెగాస్‌కు వెళ్లాం. ట్రిప్ సరదాగా జరుగుతుండగా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోదామని అజయ్ షాకిచ్చాడు.

అనారోగ్యమని అజయ్ దేవగన్
గ్రీస్ నగరంలో ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా సడన్‌గా ఓ రోజు ఇండియాకు వెళ్లిపోదాం అని అజయ్ చెప్పడంతో దిమ్మతిరిగింది. కారణమేమిటంటే.. ఇప్పటికే 40 రోజులు గడిచపోయాయి. నేను బాగా అలసి పోయాను అని చెప్పాడు. ఇలాంటి నేపథ్యంలో ఓ ఉదయం పొద్దున్నే లేచి నాకు తలనొప్పి, జ్వరంగా ఉంది అని చెప్పాడు.

మధ్యలోనే అలా తిరిగి వచ్చాం
ఏదో హోమ్ సిక్ ఉందని నేను భావించాను. మందులు వేసుకొంటే తగ్గిపోతుందని చెప్పాను. అదేమీ పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోదా అనే పదే పదే చెప్పడం ప్రారంభించాడు. దానికి నేను చిరాకుగా తలనొప్పి లేస్తే హానీమూన్ క్యాన్సిల్ చేసుకొంటారా అని అడిగాను. ఆ తర్వాత మధ్యలోనే తిరిగి వచ్చాం అని కాజోల్ చెప్పారు.

1999లో కాజోల్ వివాహం
1994 నుంచి కాజోల్, అజయ్ దేవగన్ డేటింగ్ చేయడం ప్రారంభించారు. 1999లో ఓ ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో పెళ్లి చేసుకొన్నారు. సినీ ప్రముఖులను ఎవరినీ పిలువకుండా కేవలం కాజోల్, అజయ్ కుటుంబ సభ్యులే హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











