కళ్లుచెదిరే బంగ్లా కాజోల్ సొంతం.. ముంబై నడిబొడ్డున విలాసవంతమైన భవనంలోకి..

మహారాష్ట్రంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఇంటిని చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండువారాల్లో టాప్ బాలీవుడ్ స్టార్లు కొత్త భవనాలు కొనుగోలు చేసిన వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా అమితాబ్ బచ్చన్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్; హృతిక్ రోషన్, ఆలియాభట్ తదితరులు ఖరీదైన, విలాసవంతమైన ఫ్లాట్స్‌ను కొనుగోలు చేయడం విశేషంగా మారింది. ఇక వారి జాబితాలో కాజోల్, అజయ్ దేవగన్ దంపతులు చేరారు.

ఇటీవల అజయ్ దేవగన్, కాజోల్ కొనుగోలు చేసిన బంగ్లా ముంబైలోని జుహు ప్రాంతంలోనే ఉంది. ప్రస్తుతం వారు నివసిస్తున్న శక్తి నివాసానికి కనుచూపు మేరలోనే ఉండే భవనాన్ని కొనుగోలు చేశారు. దాని విలువ అక్షరాల రూ.60 కోట్లు అని వెల్లడైంది.

Kajol devgan couple buys worth 60 crores builiding in Juhu of Mumbai

అజయ్ దేవగన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భవన వైశాల్యం 590 చదరపు అడుగులు. గతేడాదిగా ఇంటి కోసం చూస్తున్నాం. అదృష్టం కొద్ది మా ఇంటికి దగ్గర్లోనే లభించింది అని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఇల్లు దివంగత పుష్ప వాలియాకు చెందినదని తెలిసింది. ఈ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికే మరమ్మత్తులు, కొత్త డిజైనింగ్‌ పనులు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఈ ఇంటికి సంబంధించిన డీల్ నవంబర్‌లోనే పూర్తయింది. తనపై, అలాగే తన తల్లి వీణా వీరేంద్ర దేవగణ్ పేరిట రిజిస్టర్ చేసినట్టు సమాచారం.

అజయ్ దేవగన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సూర్యవంశీ, గంగూభాయ్ కతియావాడీ, RRR చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మైదాన్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, థ్యాంక్యూ గాడ్, మేడే చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X