Shahrukh Khan: ప్రధానమంత్రి అభ్యర్థిగా షారుక్ ఖాన్.. నరేంద్ర మోదీకి పోటీగా? ఇది కదా ఇంట్రెస్టింగ్!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్న ఏదో ఒక విధంగా విమర్శల పాలయింది. బాయ్ కాట్, నెపోటిజం అంటూ అనేక కారణాలతో హిందీ చిత్రాలను ట్రోలింగ్ చేశారు, బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడమే కాకుండా పెట్టిన బడ్జెట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అయితే జనవరి 25న విడుదలైన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా మాత్రం అవన్నీ దాటి సాలిడ్ హిట్ కొట్టింది.

అది షారుక్ కే కాకుండా ఎంటైర్ హిందీ చిత్రపరిశ్రమకు బాసటగా నిలిచింది. ఇదిలా ఉంటే తరచు వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే బాలీవుడ్ యాక్టర్, సినీ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) షారుక్ ఖాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పఠాన్ గా ముందుకు వచ్చిన షారుక్..

పఠాన్ గా ముందుకు వచ్చిన షారుక్..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సుధీర్ఘకాలంగా సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ మూటగట్టున్న షారుక్ ఖాన్ ఇటీవల రాకెట్రీ, బ్రహ్మాస్త్రం వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. షారుక్ ఖాన్ ఫుల్ లెంగ్త్ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూశారు. ఈ క్రమంలోనే తాజాగా పఠాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్ ఖాన్.

దాదాపుగా నాలుగేళ్ల తర్వాత..

దాదాపుగా నాలుగేళ్ల తర్వాత..

హిందీ చిత్రసీమలో హిట్ పెయిర్ గా టాక్ తెచ్చుకున్నారు షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె. వీళ్లిద్దరు ఇప్పటికీ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో జంటగా కలిసి నటించారు. తాజాగా నాలుగోసారి వీళ్లిద్దరు కలిసి జోడి కట్టిన చిత్రం పఠాన్. చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే పఠాన్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

సల్మాన్ ఖాన్ ఎంట్రీతో..

సల్మాన్ ఖాన్ ఎంట్రీతో..

హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు చిత్రీకరించిన యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జనవరి 25న గ్రాండ్ గా విడుదలైంది. యశ్ రాజ్ ఫిలీంస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పిరియన్స్ కు విజిల్స్ కొడుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

షారుక్ పై ఆసక్తికరంగా..

షారుక్ పై ఆసక్తికరంగా..

ఇదిలా ఉంటే స్వయం ప్రకటిత సినీ విమర్శకుడు, ట్రేడ్ అనలిస్ట్ కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై నటీనటులపై ట్వీట్ లు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలుస్తాడు. ఇందులో భాగంగానే పఠాన్ రిలీజ్ కు ముందు ఆ సినిమాకు ఆ టైటిల్ కాకుండా వేరే పేరు పెట్టాలని సూచించాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వచ్చే ఎలక్షన్స్ ను ఉద్దేశించి..

వచ్చే ఎలక్షన్స్ ను ఉద్దేశించి..

కమల్ ఆర్ ఖాన్ పోస్ట్ చేసిన తాజా ట్వీట్ లో.. "ఒకవేళ మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటిగా కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా షారుక్ ఖాన్ ను ప్రకటిస్తే.. వచ్చే 2024 ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా (ఆసక్తికరంగా) ఉంటాయి" అని రాసుకొచ్చి.. లాఫింగ్ ఎమోజీని షేర్ చేశాడు. అంటే వచ్చే ఏడాది మే నెలలో ఎలక్షన్స్ రాబోతుండగా.. ఇప్పుడున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపోనెంట్ గా షారుక్ ఖాన్ పోటీ చేస్తే బాగుంటుందని ఆయన సెటైరికల్ గా ట్వీట్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు.

మీరే పీఎమ్ అభ్యర్తి కాకూడదు..

ఇక కమల్ ఆర్ ఖాన్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "ఎందుకు తర్వాతి ప్రధాన మంత్రి క్యాండిడేట్ కేఆర్కేనే కాకూడదు" అని ఒక నెటిజన్ రాసుకొస్తే.. "నేను ఇప్పటివరకు కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ లో చదివిన అత్యంత మర్యాదపూర్వకమైన ట్వీట్ ఇది" అని మరొక యూజర్ రాసుకొచ్చాడు. ఇంకొందరు కమల్ ఆర్ ఖాన్ నటించిన సినిమా వీడియో క్లిప్లింగ్ లను ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ విధంగా మళ్లీ కేఆర్కే వార్తల్లో హైలెట్ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X