twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో మరణించిన ‘కామసూత్ర 3డి’ హీరోయిన్!

    |

    2013లో వచ్చిన 'కామసూత్ర 3డి' మూవీలో లీడ్ రోల్ చేసిన సైరా ఖాన్ గుండెపోటుతో మరణించారు. రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదట షెర్లిన్ చోప్రాను లీడ్ రోల్‌గా అనుకున్నారు. పలు కారణాలతో ఆమె తప్పుకోవడంతో సైరా ఖాన్ ఆ అవకాశం దక్కించుకున్నారు.

    సైరా ఖాన్ హఠాన్మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రూపేష్ పాల్ స్పందించారు. 'సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల కామసూత్ర 3డి చిత్రానికి సైన్ చేయడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.' అని గుర్తు చేసుకున్నారు.

    ఈ సినిమా ఆమెకు సవాలుగా మారింది

    ఈ సినిమా ఆమెకు సవాలుగా మారింది

    సంప్రదాయవాద ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం, అలాంటి బోల్డ్ మూవీతో బాలీవుడ్లోకి అడుపెట్టడం ఆమెకు సవాలుగా మారింది. కొన్ని నెలల తర్వాత ఆమె ప్రయత్నం ఫలించింది. కాస్త ఆలస్యమైన ఒక మంచి నటి దొరికిందనే సంతృప్తి కలిగింది. ఆమెలా ఎవరూ చేసుండేవారు కాదు' అని రూపేష్ పాల్ తెలిపారు.

    మీడియాలో మరణ వార్త రాకపోవడంపై

    మీడియాలో మరణ వార్త రాకపోవడంపై

    సైరా మరణం గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రూపేష్ పాల్ ట్వీట్ చేశారు. ‘ఆమె మరణవార్త విని షాకయ్యాను. అయితే ఏ మీడియా సంస్థ కూడా ఈ విషాదం గురించి ప్రజలకు వెల్లడించక పోవడం ఆశ్చర్య వేసింది.' అన్నారు.

    ఆత్మ శాంతించాలి

    ఆత్మ శాంతించాలి

    ఆమె తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అయినా ఆమెను ఎవరూ గుర్తించక పోవడం బాధాకరం. సైరా ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... అని రూపేష్ పాల్ ట్వీట్ చేశారు.

    సైరా ఖాన్

    సైరా ఖాన్

    ‘కామసూత్ర 3డి' సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి ముందే సైరా ఖాన్ కొన్ని రీజనల్ చిత్రాల్లో నటించారు.

    English summary
    Kamasutra 3D actor Saira Khan passed away on Friday morning. The reason behind her death is believed to be cardiac arrest. The actor rose to fame after replacing Sherlyn Chopra in the film which was directed by Rupesh Paul.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X