Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కంగన రనౌత్‌ను ట్రోల్స్‌తో చీల్చి చెండాడిన నెటిజన్లు.. షారుక్‌పై అలాంటి కామెంట్లు చేయడంతో..
బాలీవుడ్ క్వీన్ కంగనరనౌత్ ఇటీవల తరచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసే ట్వీట్లు అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. అయినా తన పంథాను మారకుండా తాను ఏం చెప్పాలనుకొంటుందో ఆ విషయాన్ని చెప్పడం ఆపడం లేదు. తాజాగా కంగన రనౌత్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. ఆ వివరాల్లోకి వెళితే..
హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్
కంగన రనౌత్ బాలీవుడ్‌లోకి ప్రవేశించి ఏప్రిల్ 28 తేదీతో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా ట్వీట్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. నేను నటించిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ఏప్రిల్ 28, 2006 తేదీన రిలీజ్ అయిది. హిందీ సినిమా రంగంలో నా ప్రయాణం 15 ఏళ్లు. బాలీవుడ్‌లో నాది, షారుక్‌ది అతిపెద్ద సక్సెస్ స్టోరీలు.

షారుక్ ఖాన్ ఢిల్లీ నుంచి వచ్చారు. కాన్వెంట్‌లో చదువుకొన్నారు. ఆయన తల్లిదండ్రులు సినిమాతో సంబంధాలు కలిగి ఉన్నారు. నా విషయానికి వస్తే నేను హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. సరిగా ఎడ్యుకేషన్ లేదు. ఇంగ్లీష్ అంటే ఏమిటో తెలియదు అని కంగన తన ట్వీట్‌లో తెలిపారు.
అయితే షారుక్ తల్లిదండ్రులకు సినిమా రంగంతో సంబంధం ఉందనే మాటపై ఘాటుగా స్పందించారు. తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా? అంటూ నిలదీశారు. షారుక్ ఖాన్ తండ్రి కనీసం జూనియర్ ఆర్టిస్టు కూడా కాదు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆడిటోరియం వద్ద క్యాంటిన్ నడిపే వారు. ఆయనకు గానీ, వారి కుటుంబానికి సినిమాతో సంబంధం లేదు అంటూ కంగనను నెటిజన్లు చీల్చి చెండాడారు.