Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
'అగ్నిపథ్'పై మొదటిసారి స్పందించిన కంగనా.. ఇలా చేస్తే ఆ విషయం అర్ధమవుతుందని అంటూ..
దేశంలో దారుణమైన అలజడిని క్రియేట్ చేసిన అగ్నిపథ్ నిర్ణయంపై కొంతమంది ప్రముఖులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానంపై యువత తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇక ఈ విధానంపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించే ప్రయత్నం చేసింది. అలాగే మోడీ ప్రభుత్వానికి ఆమె మరోసారి మద్దతు పలికింది. కంగనా ఎలాంటి వివరణ ఇచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

మాట్లాడేందుకు వెనుకడుగు
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ విధానంపై ఆర్మీ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో చాలామంది ప్రముఖులు ఈ విషయంలో స్పందించడానికి సంకోచిస్తున్నారు. దారుణమైన స్థాయిలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగేలా అలాగే ప్రాణ నష్టం కలిగేలా ఉద్యమం కొనసాగుతూ ఉండడంపై పలువురు రాజకీయ ప్రముఖులు సైతం మౌనంగానే ఉన్నారు. సామాజిక అంశాలపై స్పందించే సినీ సెలబ్రెటీలు సైతం ఈ విషయంలో నోరు మెదపడం లేదు.

కంగనా రియాక్షన్
అయితే బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ మాత్రం ఈ సెన్సిటివ్ విషయంలో తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై ఆమె పాజిటివ్ గానే స్పందించారు. ఇదివరకే చాలాసార్లు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇచ్చిన కంగనా మరోసారి అదే తరహాలో సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా చేస్తే..
ఇప్పటికే ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాలు ఇదే తరహాలో యువతకు దేశ సైన్యంలో అవకాశం కల్పించి ఎంతో అవగాహన వచ్చేలా చేశాయని కొన్నాళ్లపాటు ఆర్మీలో పనిచేస్తే యువత మంచి దారిలో క్రమశిక్షణతో కొనసాయగుతుందని అన్నారు. కేవలం క్రమశిక్షణ మాత్రమే కాకుండా జీవితంలో ఒక బాధ్యతాయుతంగా నడుచుకోవడం అలాగే దేశాన్ని సైనికుడిగా ఎలా రక్షించుకోవాలో కూడా నేర్చుకుంటారని కంగనా పేర్కొంది.

లోతైన అర్థం ఉందని..
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ నియామకాలు అమలు చేయడంలో ఎంతో లోతైన అర్థం ఉందని అంటూ ఆర్మీ ఉద్యోగం అంటే డబ్బు సంపాదనకు అలాగే భవిష్యత్తు ఉపాధి నిర్మించుకోవడానికి కారణం కాకూడదని అప్పట్లో ఎలాగైతే ప్రతీ ఒక్కరు దేశంపై బాధ్యతో గురుకులానికి వెళ్ళేవారో ఇప్పుడు అగ్నిపథ్ కు వెళతారని కంగనా తెలియజేసింది.

చాలా అవసరం..
ఇక డ్రగ్స్, పబ్జి మోజులో బానిసత్వంగా మారిన చాలామంది యువత ఇలాంటి మంచి పనితో ఒక క్రమశిక్షణతో ఉంటారని ఇలాంటి సంస్కరణలు దేశానికి యువతకు చాలా అవసరం అని అగ్నిపథ్ విధానంపై కంగనా చాలా పాజిటివ్ గా స్పందించింది. ఇక ఈ విషయంలో ఆమె మోడీ ప్రభుత్వంపై పూర్తిగా మద్దతు పలుకుతూ వివరణ ఇచ్చినట్లు తెలపడంతో ఓ వర్గం వారు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

కంగనా సినిమాల విషయానికి వస్తే..
ఇక కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే ఆమె గత కొంత కాలంగా వరుస అపజయలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన దాఖడ్ సినిమా అయితే కనీసం థియేటర్స్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకు రాలేదు. ఆ సినిమా 75కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఇక ప్రస్తుతం తేజస్ అనే సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక నిర్మాతగా కంగనా ఒక కొత్త సినిమాని విడుదల చేయనుంది. మరి ఆ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.