Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈర్షపడకు, మీడియాకెక్కితే లాభం లేదు.. చేతనైతే రుజువు చేసుకో.. క్రిష్‌పై కంగన ఫైర్
బాలీవుడ్ నటి కంగన రనౌత్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. క్రిష్ చేస్తున్న ఆరోపణలపై కంగన రనౌత్ స్పందించారు. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా దర్శకత్వ టైటిల్ వివాదం వారి మధ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత విదేశీ విహారయాత్రకు వెళ్లిన కంగన స్వదేశానికి తిరిగి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

క్రిష్‌పై కంగన రనౌత్ ఫైర్
తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న దర్శకుడు క్రిష్, రచయిత అపూర్వ ఆస్రానీ,నటులు సోను సూద్, మిష్తి చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనుసూద్, మిస్తి, అపూర్తను కలుపుకొని ఓ మంచి సినిమాను తీసి నాకు గుణపాఠం నేర్పు అని క్రిష్‌కు సవాల్ విసిరింది.

క్రిష్ రుజువు చేసుకోమని
నాపై క్రిష్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ తనే దర్శకత్వం చేశారని భావిస్తే రుజువు చేసుకోమను. మీడియాలో నోరు పారేసుకోవడంతో ఏమీ కాదు. అదృష్టమో, దురదృష్టమో మణికర్ణిక రిలీజైంది. దానికి నేను దర్శకత్వం వహించానని చెప్పుకోవడం గర్వంగా ఉంది

ఎవరేమీ అన్నా నేను పట్టించుకోను
నా పాత్రను కుదించారని, నా స్క్రిప్టును నాశనం చేశారని ఆరోపణలు చేస్తున్న వారికి నేను సమాధానం చెప్పాలనుకొంటున్నాను. నటిగా, మూడుసార్లు ఉత్తమ జాతీయ నటిగా, దర్శకురాలిగా నాకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. సినిమా రిలీజైన తర్వాత వారేమి అనుకొన్నా నేను పెద్దగా పట్టించుకోను అని కంగన చెప్పింది.

ఈర్ష పడితే లాభం లేదని
మణికర్ణిక సినిమా రిలీజైన తర్వాత నెత్తి నోరు బాదుకుంటే ప్రయోజనం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను క్రిష్ వదిలేసి వెల్లడంతో నా చేతుల్లోకి వచ్చింది. ఆ పొజిషన్లో ఉన్న ఎవరైనా తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తారు. నేను అలాగే సినిమాను నా కోణంలో రూపొందించేందుకు ప్రయత్నించాను అని కంగన స్పష్టం చేసింది. సినిమా హిట్టయిన తర్వాత వారు ఈర్ష్యకు లోనైతే చేసేదేమీ లేదు అని అన్నారు.