కరోనా తరువాత విడుదల కాబోయే మొదటి పాన్ ఇండియా సినిమా ఇదేనా
కరోనా వైరస్ దెబ్బకు గత ఏడాది నుంచి ప్రపంచ సినిమా ఇండస్ట్రీలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వడ్డీలకు అప్పులు చేసి సినిమాలను నిర్మించే నిర్మతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎలాగోలా సినిమాలను విడుదల చేసి అప్పులు క్లియర్ చేసుకోవాలని అనుకునే వాళ్లకు సరైన దారి దొరకడం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ వడ్డీలు గట్టిగానే పెరిగుతున్నాయి.
ఇక సెకండ్ వేవ్ కాస్త నెమ్మధించడంతో కొంతమంది నిర్మాతలకు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక కరోనా లాక్ డౌన్ అనంతరం వెండితెరపై ఇంతవరకు పాన్ ఇండియా సినిమలేవి విడుదల కాలేదు. ఇక ఇప్పుడు కరోనా అనంతరం మొదటిసారి లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి త్వరలోనే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా వల్ల మళ్ళీ ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలను ఫిక్స్ చేసుకోగా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గడంతో కొత్త డేట్ పై చర్చలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ తలైవి రిలీజ్ అయితే కరోనా అనంతరం విడుదలైన మొదటి పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. మరి కరోనా మహమ్మారి ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











