Aamir Khan's divorce with Kiran Rao.. మతాంతర వివాహంలో అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించచడం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఒకరకమైన షాక్ గురిచేసింది. తాము ఇక కలిసి ఉండలేం అంటూ జూలై 3వ తేదీన ఓ ప్రకటను ఇద్దరు కలిసి రిలీజ్ చేశారు. అయితే వారిద్దరి విడాకులపై సినీ ప్రముఖులు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ కంగన రనౌత్ మాత్రం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో ఆమె ఏం అన్నారంటే...

ఒకరిని హిందువుగా.. మరొకరిని సిక్కుగా

ఒకరిని హిందువుగా.. మరొకరిని సిక్కుగా

ఒకానొకప్పుడు పంజాబ్‌లో దాదాపు కుటుంబాలన్ని తమకు పుట్టిన సంతానంలో ఒకరిని హిందువుగా.. మరొకరిని సిక్కుగా పెంచుతారు. ఇలాంటి ట్రెండ్ హిందువులు-ముస్లింలలో కనిపించదు. కానీ ప్రత్యేకంగా ముస్లిం మతం, అలాగే అమీర్ ఖాన్ సార్ సెకండ్ విడాకుల పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగింది అని కంగన తన పోస్టులో వివాదాస్పద అంశాలను వెల్లడించారు.

అమీర్ ఖాన్ మతాంతర వివాహం చేసుకొని

అమీర్ ఖాన్ మతాంతర వివాహం చేసుకొని

కిరణ్ రావును మతాంతర వివాహం చేసుకొన్న అమీర్ ఖాన్ తన కుమారుడిని హిందువుగా ఎందుకు పెంచలేదు.. ముస్లిం మతానికి ఎందుకు పరిమితం చేశారు. అమీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకొన్న కిరణ్ రావు హిందువుగా ఎందుకు కొనసాగలేదు అని కంగన తన పోస్టులో వ్యాఖ్యలు చేసింది అని కంగన ప్రశ్నించింది.

పెళ్లితోపాటు కొన్ని విషయాలు

పెళ్లితోపాటు కొన్ని విషయాలు

దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కాలం, పరిస్థితులు వేగంగా మారిన సమయంలో మతం విషయంలో ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది. పెళ్లితోపాటు కొన్ని విషయాలు మారాల్సి ఉండాల్సింది. కానీ అలాంటివి జరగకుండా మతం విషయంలో తిరోగమనం, పాత ఆచారాలే పాటించడాన్ని అంతా గమనించాలి అని తన పోస్టులో కంగన పేర్కొన్నారు.

మతాంతర వివాహం చేసుకొంటే

మతాంతర వివాహం చేసుకొంటే


ఒకవేళ హిందు, జైన్, బౌద్దమతం, సిక్కు లాంటి మతాలకు చెందిన వారు ముస్లింతో మతాంతర వివాహం చేసుకొంటే మహిళ ఎందుకు ముస్లింలా ఉండాలి. ముస్లింను పెళ్లి చేసుకొన్న తర్వాత ఒకరు తమ మతాన్ని ఎందుకు మార్చుకోవాలి అంటూ కంగన ప్రశ్నించింది. మతాంతర వివాహంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండేలా చట్టాలు ఉండాలి అనే విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో.

వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో.

ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు, వివాదాస్పద అంశాలపై కంగన రనౌత్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌లో జరిగిన మత ఘర్షణలపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకు హిందువులకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? దేశంలో హిందువులపై దాడులు ఇంకెన్నాళ్లు జరుగుతాయి అని ప్రశ్నించారు. దాంతో ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధించడం అప్పట్లో వివాదాస్పదమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X