twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhaakad Movie: దారుణంగా కంగనా సినిమా పరిస్థితి.. 90 కోట్ల సినిమాకు 20 టికెట్లు మాత్రమే!

    |

    కంగనా రనౌత్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె మళ్ళీ నేరుగా తెలుగు సినిమాలు చేయలేదు. ఆమె నటించిన మణికర్ణిక సినిమా తెలుగులో కూడా విడుదలైంది కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆమె అప్పటి నుంచి హిందీ సినిమాలకే పరిమితం అయింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫేమస్ అయింది. తాజాగా 'ధాకడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఆ సినిమా విషయంలో దారుణ పరాజయాన్ని అందుకుంది. 90 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దారుణ డిజాస్టర్ గా నిలవనుంది. ఆ వివరాల్లోకి వెళితే

    మే 20న

    మే 20న

    వివాదాస్పద అంశాల మీద స్పందిస్తూ ఉండే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ హీరోయిన్ ఓరియంటడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలోనే కంగనా తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్' మే 20న విడుదలైంది. అయితే సినిమా జనాన్ని ఎట్రాక్ట్ చేయడంలో విఫలం అయింది. కంగనా రనౌత్ 'ధాకడ్' విడుదలైన ఎనిమిదో రోజున కేవలం 20 టికెట్లు తెగాయి, ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రూ.4,420 మాత్రమే వసూలు అయ్యాయి.

    మిశ్రమ స్పందన

    మిశ్రమ స్పందన


    ఈ సినిమా తొలిరోజు నుంచే డిజాస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా, ఢాకడ్ ఇప్పటిదాకా దాదాపు రూ. 3 కోట్లు సంపాదించింది. ధాకడ్ సినిమా రూపొందించడానికి రూ. 80 కోట్ల నుండి రూ. 90 కోట్లు ఖర్చయిందట. అలాంటి సినిమాకు పది రోజుల్లో 3 కోట్లు మాత్రమే వచ్చాయి అంటే అర్ధం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన 'ధాకడ్' చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా మరియు శాశ్వత్ ఛటర్జీ నటించారు. ధాకడ్‌కు మిశ్రమ స్పందన లభించింది.

    భూల్ భులయ్యా 2

    భూల్ భులయ్యా 2


    ధాకడ్'తో పాటు విడుదలైన హారర్-కామెడీ సీక్వెల్ 'భూల్ భులయ్యా 2' ధాకడ్ ను బీట్ చేసి భారీ లాభాలను ఆర్జించింది. ఈ సినిమా రూ.100 కోట్లు దాతిండి. అనీస్ బజ్మీ 2007లో చేసిన 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ నటించారు.

     అవకాశమే లేదని

    అవకాశమే లేదని

    ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలు చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే ఉండవచ్చని అంటున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్‌ డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినా సరే ఆ నష్టాన్ని భర్తీ చేసే అవకాశమే లేదని బీటౌన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    Recommended Video

    Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
     ముందుకు రావట్లేదని

    ముందుకు రావట్లేదని

    ఈ సినిమాకు వస్తున్న టాక్ చూసిన తరువాత సినిమా కొనేందుకు ఓటీటీలు కూడా ముందుకు రావట్లేదని సమాచారం. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిన కంగనా సినిమాకు ఇలాంటి చెత్త కలెక్షన్లు రావడం షాకింగ్ అనే చెప్పాలి.

    English summary
    Kangana Ranaut Dhaakad sells only 20 tickets on 8th day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X