రేప్, లైంగిక వేధింపుల కేసులపై పట్టింపు లేదు... ఐశ్వర్యరాయ్ మీద జోక్ వేస్తే ఇంత సీనా?
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్... ఐశ్వర్యరాయ్ ఫోటోతో చేసిన ట్విట్టర్ పోస్ట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివేక్ దిగిరాక తప్పలేదు. ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశించి వివేక్ ఒబెరాయ్ ఓ ఫన్నీ మీమ్ షేర్ చేశారు. ఐశ్వర్యరాయ్-సల్మాన్ ఖాన్ ఉన్న ఫోటోకు ఒపీనియన్ పోల్ అని, వివేక్ ఒబెరాయ్-ఐశ్వర్యరాయ్ ఉన్న ఫోటోకు ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ఉన్న ఫోటోకు అసలైన ఫలితం అంటూ క్యాప్షన్ పెట్టి ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఈ వివాదంపై కంగనా రనౌత్ సిస్టర్ రంగోలి రియాక్ట్ అయ్యారు.

ఐశ్వర్యరాయ్ మీద జోక్ వేస్తే ఇంత సీనా?
జాతీయ మహిళా కమీషన్ అసలైన కేసులను పట్టించుకోకుండా.... సిల్లీ జోక్స్ వేస్తే చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతుందని రంగోలి ఫైర్ అయ్యారు. మన దేశంలో మహిళా కమీషన్ అనేది ఒక ఫ్రాడ్ సంస్థగా తయారైందని, ఈ సంస్థ మూలంగా స్త్రీవాదం చచ్చిపోతోందని రంగోలి ఆవేదన వ్యక్తం చేశారు.

రేప్, లైంగిక వేధింపుల కేసులపై పట్టింపు లేదా?
దేశంలో ఎన్నో రేప్ సంఘటనలు, లైంగిక వేధింపులు లాంటి దుర్మార్గాలు చోటు చేసుకుటున్నాయి. వాటిని మహిళా కమీషన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ వివేక్ ఒబెరాయ్ లాంటి వారు సరదాగా ఒక జోక్ వస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్లు హడావుడి చేస్తోంది. మహిళా కమీషన్ పని తీరు సరిగా లేదని రంగోలి తెలిపారు.

కంగనా ఒక స్టార్ హీరోపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు
నా సోదరి కంగనా రనౌత్ ఒక పెద్ద హీరో మీద ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో మహిళా కమీషన్‌కు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా, సహాయం కోసం ఆశ్రయించినా పట్టించుకోలేదు. ఎంతో మంది మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవేవీ పట్టించుకోకుండా చైల్డిష్ జోకులపై మహిళా కమీషన్ తెగ హడావుడి చేస్తోంది అంటూ రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











