Just In
- 1 min ago
నాని vs నాగ చైతన్య.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిందే!
- 18 min ago
అప్పుడే బిజినెస్ మొదలు పెట్టిన RRR నిర్మాత.. షాక్ ఇస్తున్న ఓవర్సీస్ రైట్స్
- 48 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్
- 1 hr ago
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్, చెర్రీ సందడి
Don't Miss!
- News
కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్ లకు సమస్య , రసమయిని సీఎం చెయ్ : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
- Sports
సైనీ గాయం గురించి మర్చిపోయా.. మూడో పరుగు కోసం రమ్మన్నాను! అంతలోనే: పంత్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హృతిక్! నీ చిల్లర వేషాలు ఆపు.. కంగనా నోరు విప్పితే నీ పని ఖతం.. రంగోలి సంచలన వ్యాఖ్యలు
కంగనా రనౌత్.. ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా నిలుస్తున్న పేరిది. మొన్నామధ్య మణికర్ణిక వివాదంతో తరుచూ వార్తల్లో నిలిచిన కంగనా.. ఈ మధ్య ఆలియా భట్‌పై విమర్శలు గుప్పించి తెగ హంగామా చేసింది. ఈ వివాదంలో కంగనాకు అండగా నిలుస్తూ సపోర్ట్‌గా మాట్లాడిన ఆమె సోదరి రంగోలి.. ఈ సారి కంగనా మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై మండిపడింది. కంగనా జోలికొచ్చావా.. నీ పని ఖతం అంటూ అతన్ని హెచ్చరించింది రంగోలి. ఇక విషయంలోకి వస్తే..

ఒకేరోజు ఇద్దరి సినిమాలు
కంగనా, హృతిక్ రోషన్.. ఈ మాజీ ప్రేమికులిద్దరూ త్వరలో బాక్సా ఫీస్ వార్‌కి సిద్ధమయ్యారు. కంగనా రనౌత్ నటించిన `మెంటల్ హై క్యా`, హృతిక్ రోషన్ హీరోగా రాబోతున్న `సూపర్ 30` సినిమాలు ఒకే రోజున విడుదల కానుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హృతిక్ కలెక్షన్స్ దెబ్బతీసేందుకు గాను కంగనా కావాలనే తన సినిమాతో అదే రోజు ప్రేక్షకుల ముందుకొస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇది గమనించిన కంగనా సోదరి రంగోలి.. హృతిక్ రోషన్ పై, ఆయన అభిమానులపై ఘాటుగా స్పందించింది.

హృతిక్ తో కంగనా ఢీ
కంగనా రనౌత్ నటించిన `మెంటల్ హై క్యా`, హృతిక్ రోషన్ `సూపర్ 30` సినిమాలు ఒకే రోజు అనగా జులై 26 న థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. నిజానికి కంగనా `మెంటల్ హై క్యా` జూన్ నెలలోనే విడుదల కావాల్సిఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి జులై 26 న ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ చేశారు. సరిగ్గా అదేరోజు కంగనా మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ సినిమా కూడా విడుదల కానుండటం పలు చర్చలకు దారితీసింది.

కావాలనే కంగనా ఇలా చేస్తోంది.. ఏక్తా కపూర్ క్లారిటీ
తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై పలుసార్లు బహిరంగ విమర్శలు చేసిన కంగనా.. కావాలనే పట్టుబట్టి ఈ నిర్ణయం తీసుకుందని, హృతిక్ సినిమా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడేందుకే ఆమె ఇలా తన సినిమాను వాయిదా వేసుకొందని పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. దీంతో సినిమాను వాయిదా వేయడంలో కంగనా పాత్ర ఏమీ లేదని.. అది తాను తీసుకున్న నిర్ణయమేనని `మెంటల్ హై క్యా` నిర్మాత ఏక్తాకపూర్ క్లారిటీ ఇచ్చారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఆపేయాలని ఆమె కోరారు.

రంగంలోకి కంగనా సోదరి..
ఘాటుగా అయినప్పటికీ సోషల్ మీడియాలో కంగనా పై విమర్శలు ఆగక పోవడంతో కంగనా సోదరి రంగోలి రంగం లోకి దిగింది. ఈ ఇష్యూపై ఘాటుగా స్పందిస్తూ వరుస ట్వీట్స్ చేసింది. వెన్నుపోటు పొడిచే మగాడి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం? మీరు మీ పీఆర్ టీమ్ కంగనాను ఎంత దిగాజార్చాలని చూస్తారో.. అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని కిందకు తొక్కేస్తుంది కంగనా. ఇప్పటి వరకూ ఆమె ఈ ఇష్యూని పట్టించుకోలేదంతే. నువ్వు.. నీ చిల్లర వేషాలు ఆపు అంటూ హృతిక్‌ని ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్స్ పెట్టింది రంగోలి.

కొంచమైనా కామన్‌సెన్స్ లేదా..?
పప్పు ఎప్పుడైనా పప్పే. కొంచమైనా కామన్‌సెన్స్ లేదా నీకు? బాలాజీ టెలి ఫిలిమ్స్ ఏమైనా కంగనా సొంత నిర్మాణ సంస్థనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవడానికి. కాస్త ఆలోచించి మాట్లాడండి. హృతిక్.. చూస్తూ ఉండు. కంగన నిన్నేం చేస్తుందో. ఇలాగే చేస్తే నీకున్న కొవ్వంతా కరిగించేస్తుంది అంటూ హృతిక్ పై విరుచుకు పడింది రంగోలి.

అప్పటి వరకు ఒకే.. కానీ తేడా వస్తే
తనకు నష్టం జరగనంత వరకు నీ ‘సూపర్ 30' సినిమా గురించి కానీ అందులోని నటీనటుల గురించి కానీ కంగనా ఒక్క మాట కూడా మాట్లాడదు. ఒకవేళ తేడా వస్తే నీ పని ఖతం అంటూ క్లారిటీ ఇచ్చింది రంగోలి. ఇక చూడాలి మరి.. ఈ మాజీ ప్రేమికుల ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో..!