twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధానిపై దాడి.. ప్రతీ భారతీయుడిపై దాడి.. ఉగ్రవాదుల అడ్డా అంటూ కంగన రనౌత్ ధ్వజం

    |

    పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ క్వాన్వాయ్‌లో భద్రత లోపాలు బట్టబయలు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని భద్రత గురించిన అంశంపై సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చర్చించేంత తీవ్రత ఈ వ్యవహరంలో వ్యక్తమవుతున్నది. ఈ ఘటనపై శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపనున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో ప్రధానికి ఎదురైన సంఘటనపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇంతకు ప్రధాని భద్రత వ్యవహారంలో ఏం జరిగింది? కంగన ఏమని స్పందించారనే విషయాల్లోకి వెళితే..

    పంజాబ్ పర్యటనలో నరేంద్రమోదీకి

    పంజాబ్ పర్యటనలో నరేంద్రమోదీకి

    భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం పంజాబ్‌లో పర్యటించారు. తన కాన్వాయ్‌ అర్ధాంతరంగా రోడ్డుపై నిలిచిపోవడం సెక్యూరిటీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ప్రధాని పంజాబ్‌లోని భటిండా నుంచి హుస్సేనీవాలా జాతీయ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తుండగా ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌లో ప్రధాని కాన్వాయ్ చిక్కుకుపోయింది. దాంతో భద్రతా లోపాలు ఒక్కసారిగా బయటపడటంతో తన పర్యటనను మోదీ రద్దు చేసుకొని తిరిగి వచ్చారు. ఈ ఘటనపై బీజేపీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి.

    వాతావరణం అనుకూలించకపోవడంతో

    వాతావరణం అనుకూలించకపోవడంతో

    వాస్తవానికి హుస్పేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్తూపం సందర్శన కోసం ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సింది. ప్రధాని కోసం భటిండా నుంచి హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కానీ భారీ వర్షాలు, మంచు కురవడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 20 నిమిషాలు వేచి చూశారు. ఇక పరిస్థితి మెరుగుపడే అవకాశం లేకపోవడం వల్ల మోదీ రోడ్డు ప్రయాణానికి సిద్దమయ్యారు. మార్గమధ్యంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది.

    ప్రధానికి జరిగిన సంఘటన సిగ్గుచేటు

    ప్రధానికి జరిగిన సంఘటన సిగ్గుచేటు

    ఇక ప్రధాని కాన్యాయ్‌లో భద్రతా వైఫల్యం గురించి సోషల్ మీడియాలో కంగన రనౌత్ తీవ్రస్థాయిలో స్పందించింది. పంజాబ్‌లో ప్రధానికి ఏదైతే జరిగిందో.. అది సిగ్గుచేటు. గౌరవ ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నకోబడిన ప్రతినిధి. 140 కోట్ల ప్రజల గొంతుక. అలాంటి ప్రధానిపై జరిగిన దాడి.. ప్రతీ భారతీయుడిపై జరిగిన దాడిగా కంగన అభివర్ణించారు.

    ఉగ్రవాదులకు అడ్డగా అంటూ

    ఉగ్రవాదులకు అడ్డగా అంటూ

    అంతేకాకుండా ప్రధానిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి. ఉగ్రవాద కార్యకలాపాలాకు పంజాబ్ అడ్డాగా మారుతున్నది. ఇక ఇప్పుడు కనుక వాటిని ఆపకపోతే.. జాతి మొత్తం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. #bharatstandswithmodiji అంటూ కంగన రనౌత్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. కంగన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కంగన రనౌత్ కెరీర్

    కంగన రనౌత్ కెరీర్

    బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ కంగన రనౌత్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ధాకడ్, తేజాస్, మణికర్ణిక రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

    English summary
    Bollywood actress Kangana Ranaut reacted on Modi incident. She posted that, What happened in Punjab is shameful, Honourable Prime Minister is democratically elected leader/representative/voice of 1.4 billion people, an attack on him is an attack on every single Indian
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X