కంగనాలో ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయా? డేర్‌గా చెప్పేసి షాకిచ్చిందిగా..

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, కుండా బద్దలు కొట్టేస్తూ సంచలనాలు సృష్టించడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎవరేమనుకున్నా సరే.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్పేస్తుంటుంది. ఈ రకంగా తనది ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం అని నిరూపించుకుంది కంగనా. అయితే ఆమె ముక్కుసూటి తనం పలు వివాదలకు కూడా దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడంలో కూడా విలక్షణత చాటుతూ స్ట్రాంగ్ గా ఉంటుంది కంగనా.

కాగా ఇప్పటి వరకు మనకు తెలిసిన కంగనా ఈమెనే అయితే.. ఆమె లోని మరో కోణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. మునుపెన్నడూ ఎవ్వరికీ తెలియని తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. తాను కేవలం యాక్టర్ ని మాత్రమే కాదని తనలో సామాజిక కోణం కూడా ఉందని చెబుతూ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తన యోగా టీచర్‌కు రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్టు ఆమె పేర్కొంది. అలాగే, ఆసుపత్రులు కట్టడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియవని చెప్పుకొచ్చింది కంగనా. తనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తన సోదరి ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తుంటుందని, అది తనకు ఫన్నీగా అనిపిస్తుందని ఆమె పేర్కొంది. ఇటువంటి వాటికి తాను వ్యతిరేకమని ఈ సందర్బంగా కంగనా వెల్లడించింది.

Kangana Ranaut talks about campaigns against her by ‘nepotism gangs’

నిజానికి కంగనాకు ఎటువంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకు కంగనా చాలా దూరం. అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలవడం ఆమె గొప్పతనమే అని చెప్పుకోవాలి. కంగనాకు సంబందించిన అన్ని విషయాలు ఆమె సోదరి రంగోలి సోషల్ మీడియాలో తెలుపుతూ ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలతో సమయం వృధా అవుతుందని ఆమె తెలపడం విశేషం.

ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే మణికర్ణిక సినిమాతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్న కంగన.. ప్రస్తుతం 'మెంటల్ హై క్యా' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కంగన లీడ్ రోల్ పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X