కంగన రనౌత్‌కు కరోనా పాజిటివ్.. వైరస్‌ను నాశనం చేస్తా అంటూ కామెంట్
దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులను కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతున్నది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోవిడ్19 బారిన పడి మరణించగా.. మరి కొందరు ఈ వైరస్ బారిన పడి పలువురు కోలుకొంటున్నారు. తాజాగా కరోనావైరస్ బారిన పడిన వ్యక్తుల జాబితాలో కంగన రనౌత్ కూడా చేరింది.
తనకు కరోనావైరస్ పాజిటివ్ అని రోగ నిర్ధారణ పరీక్షల్లో తేలిందని కంగన రనౌత్ తన అధికార ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించింది. శనివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నాను అని తెలిపింది. అలాగే సుఖాసనం వేసిన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో కంగన రనౌత్ వెల్లడించిన ప్రకారం.. నేను అలసటకు గురవుతున్నాను. ఆరోగ్య పరంగా బలహీనంగా మారిపోయాను. కొద్ది రోజులుగా కళ్లలో మంటలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లే ముందు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొగా, కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది అని తెలిపారు.

కోవిడ్19 చిన్నపాటి ఫ్లూ. నా శరీరంలో చేరిన వైరస్‌ను నాశనం చేస్తాను. ప్రజలకు నేను ఒకటే కోరుతున్నాను. దయచేసి నీపై ప్రభావం చూపే అవకాశం ఇవ్వకండి. నీవు భయపడితే.. అది నిన్ను ఇంకా చాలా భయపెడుతుంది. మనమంతా కోవిడ్‌ను తుదముట్టిద్దాం. మానసికంగా, శారీరంగా శక్తివంతులుగా మారుదాం. హర హర మహదేవ్ అంటూ అని కంగన రనౌత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











