»   » 250 కోట్ల బడ్జె‌ట్‌తో బ్రహ్మస్త్ర.. కరణ్‌ జోహర్ కనివినీ సాహసం.. పెద్ద రిస్కేనట!

250 కోట్ల బడ్జె‌ట్‌తో బ్రహ్మస్త్ర.. కరణ్‌ జోహర్ కనివినీ సాహసం.. పెద్ద రిస్కేనట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ అఫైర్ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్. వీరి అఫైర్ గురించి బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. బ్రహ్మస్త్ర చిత్ర షూటింగ్‌లో వీరి ఆఫ్‌ స్క్రీన్ రొమాన్స్‌ చర్చనీయాంశమవుతున్నది. ఆయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. బాహుబలికి ధీటైన్ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా బ్రహ్మస్త్ర

ప్రతిష్టాత్మకంగా బ్రహ్మస్త్ర

దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్రహ్మస్త్రను తెరకెక్కిస్తున్నది. ఇప్పటివరకు ధర్మ ప్రొడక్షన్‌లో రూపొందే అత్యంత భారీ ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రాన్ని భారీ సాంకేతికతతో రూపొందిస్తున్నారు.

 250 కోట్లతో రూపకల్పన

250 కోట్లతో రూపకల్పన

బ్రహ్మస్త్రలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్‌ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. బాలీవుడ్‌లో కనివినీ ఎరుగని విధంగా రూ.250 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 3డీలోకి కూడా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అద్భుతంగా సెట్లు, సాంకేతికత

అద్భుతంగా సెట్లు, సాంకేతికత

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో కరణ్ జోహర్ బ్రహ్మస్త్రను తెరకెక్కించడంపై చర్చనీయాంశమైంది. ఈ చిత్రం కోసం వేస్తున్న సెట్లు అద్బుతంగా ఉన్నాయనే వార్త వినిపిస్తున్నది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయట.

ఆయన్ ముఖర్జీ, కరణ్ ముఖర్జీ కసరత్తు

ఆయన్ ముఖర్జీ, కరణ్ ముఖర్జీ కసరత్తు

బ్రహ్మస్త్ర చిత్ర కథపై చాలాకాలంగా దర్శకుడు ఆయన్ ముఖర్జీ, కరణ్ జోహర్లు కసరత్తు చేశారు. ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. నెల రోజుల తర్వాత రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ సంజూ, ఆలియా భట్ రాజీ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉండటంతో ఈ రకమైన గ్యాప్ లభించింది.

ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్

ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్

సంజూ చిత్రంలో సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషించారు. ఈ చిత్ర రిలీజ్ తర్వాత బ్రహ్మస్త్ర చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రను పోషించనున్నారు. దుష్టశక్తిని అంతమొందించే సూపర్ పవర్స్ ఉన్న నాయకుడిగా రణ్‌బీర్ నటిస్తున్నాడు.

English summary
Brahmastra is the most ambitious project for Dharma Production till date. It is the costliest film to be produced by the production house, and the makers are leaving no stone unturned to make it a visual spectacle for the audience. The budget allocated to the film production is approximately Rs 250 crore, which includes the actor, director and technician’s fees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X