Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్ ఎమోషనల్.. నిద్రపోయిన హీరోయిన్.. సోషల్ మీడియాలో ట్రోల్!
ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా విడుదలైనా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కావడం లేదు. గతంలో బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా ఓపెనింగ్స్ అందుకున్న హీరోలు కూడా ప్రస్తుతం 10 కోట్లు అందుకోవడానికి కూడా ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. ఎంత ప్రమోషన్స్ చేసినా కూడా సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం జనాలు చాలా ఈజీగా సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో అందరి ఫోకస్ ఎక్కువగా ఆమిర్ ఖాన్ నటించిన సినిమా పైనే ఉంది. ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కథ ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉండబోతుందట.

ఇదివరకే ఈ సినిమాను కొంతమంది తెలుగు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా వీక్షించారు హైదరాబాదులో ఆమిర్ ఖాన్ స్పెషల్ షో కూడా వేయడం జరిగింది. అందులో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున దర్శకుడు రాజమౌళి సుకుమార్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాను ఇటీవల కొంతమంది బాలీవుడ్ ప్రముఖులతో కలిసి అమీర్ ఖాన్ అలాగే చిత్ర యూనిట్ సభ్యులు కూడా వీక్షించారు.

అయితే అందులో సన్నివేశాలను చూసి ఆమీర్ ఖాన్ ఎమోషనల్ అవుతూ ఉండగా పక్కనే ఉన్న కరీనాకపూర్ మాత్రం నిద్రపోతున్నట్లుగా కనిపించింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఒకవైపు హీరో ఎమోషనల్ అవుతుంటే మరొకవైపు హీరోయిన్ మాత్రం అలాగే నిద్రపోతూ ఉండడం చూస్తూ ఉంటే ఈ సినిమా చాలా బోరింగ్ గా ఉందేమో అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ సినిమా చూసినా చాలా మంది సినీ ప్రముఖులు మాత్రం అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.