Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా భర్తే స్నేహితులతో పడక పంచుకోమన్నాడు.. అక్రమ సంబంధాలను తట్టుకోలేకపోయా: సీనియర్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు ఎంతో స్టార్ డమ్ తో కనిపిస్తారు. కెమెరా ముందు ఎప్పటికి నవ్వుతూ కనిపించే వారి జీవితంలో అన్ని అలానే ఉంటాయని అనుకోవడం పొరపాటే. తెరవెనుక జరిగే కొట్లాటలు దారుణాలు సినిమాల్లో ట్విస్టుల కంటే దారుణంగా ఉంటాయి. ఇటీవల ఒక అగ్ర హీరోయిన్ చెప్పిన బయటపెట్టిన ఒక దారుణమైన విషయం మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు 90ల కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కరిష్మా కపూర్.

బాక్సాఫీస్ హిట్ సినిమాలతో భారీ క్రేజ్
జిగర్ (1992), అనారి (1993), రాజా బాబు అండ్ సుహాగ్ (1994), కూలీ నెంబర్ 1 (1995), గోపి కిషన్ (1995) వంటి సినిమాలతో అప్పట్లో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ సీనియర్ నటి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. 46ఏళ్ల వయసులో కూడా ఆమె తనదైన గ్లామర్ తో నేటితరం హీరోయిన్స్ కు పోటీని ఇస్తోంది.

షారుక్ సినిమాల్లో స్పెషల్ గా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ నటిగా మంచి క్రేజ్ అందుకుంటోంది. కపూర్ ఫ్యామిలీలో కరిష్మా బెస్ట్ హీరోయిన్ అనే బ్రాండ్ ను కూడా అందుకుంది. ఇక 2003 తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈ సినీయర్ నటి 2007లో షారుక్ తో ఓం శాంతి ఓం సినిమాలో స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది. 2018లో షారుక్ జీరో సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించింది.

మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు
ఇక చాలా రోజుల తరువాత కరిష్మా కపూర్ తన గత జీవితంలోని చేదు అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ పై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేశాయి. మొదట్లో విడాకులు తీసుకోవడానికి కారణం కరిష్మా కపూర్ పొరపాటు చేసినందు వల్లే అంటూ అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

నరకం అనుభవించాను
ఇక కరిష్మా ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆ రూమర్స్ కు చెక్ పడింది. ఆమె మాట్లాడుతూ.. వివాహం తరువాత జీవితం ఎంతో సరదాగా ఉంటుందని అనుకున్నా . కానీ ఒక్కసారిగా మారిపోతుందని ఉహీంచలేదు. ప్రతి రోజు నరకం అనుభవించాను. హనీమూన్ రోజే అసలు విషయం అర్ధమైందని ఆ రోజును ఇంక మరచిపోలేనని చెప్పింది.

స్నేహితులతో కలిసి పడక పంచుకోవాలని..
హనీమూన్ లో నా భర్త సంజయ్ కపూర్ తోటి స్నేహితులతో కలిసి పడక పంచుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను నిరాకరించినప్పటికి బలవంతం చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం ఆలోచించకుండా కొట్టాడు కూడా. అంతే కాకుండా నన్ను పెళ్లి చేసుకున్న తరువాత అతని మొదటి భార్యతో కూడా సంబంధం పెట్టుకునేవాడు. నిలదీసేందుకు ప్రయత్నం చేశాను. అయినా కూడా ఏ మాత్రం మారలేదు. అందుకే విడాకులు తీసుకున్నట్లు.. కరిష్మా వివరణ ఇచ్చింది.