కత్రినా కైఫ్ వెరైటీ వర్కవుట్లు.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మై నేమ్ ఈజ్ షీలా, కాలా చష్మా అంటూ దేశ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. ఐకానిక్ స్టెప్పులతో కత్రినా ఆడియెన్స్‌లో చెరగని ముద్ర వేసింది. కెరీర్ ప్రారంభంలో నటించేందుకు, డ్యాన్స్ చేసేందుకు ఎంతో కష్టపడ్డ కత్రినా ఇప్పుడు అందరినీ దాటుకుని నెంబర్ వన్ రేసులో పరిగెడుతోంది. టాలీవుడ్‌లోనూ కత్రినా కైఫ్ రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
కత్రినా తన కెరీర్ స్టార్టింగ్‌లో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇక్కడ కత్రినాను ఆ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా మెల్లిగా బాలీవుడ్‌లోనే కొనసాగుతూ చివరకు స్టార్డంను తెచ్చుకుంది. కానీ కత్రినా సినిమాలతో కంటే పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయింది. సల్మాన్, కుర్ర హీరోలతో కత్రినా ప్రేమ వ్యవహారం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

కత్రినా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. నిత్యం ఫిట్ నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ వర్కవుట్ వీడియోను షేర్ చేసింది కత్రిన. మామూలుగా జిమ్ చేస్తేనే బాడీ ఫిట్‌గా ఉంటుందని అనుకున్నాను కానీ ఇలా వెరైటీ వర్కవుట్ చేస్తుండటంతో పైలెట్స్ కూడా ఎంతో ఫిట్‌గా ఉంటారని అర్థమవుతోందంటూ వీడియోను షేర్ చేసింది. కత్రినా చివరగా సల్మాన్ భరత్ సినిమాలో నటించింది. ఇక సూర్యవంశీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











